సా విరహే తవ దీనా!

సా విరహే తవ దీనా!


ఈ అష్టపదిలో కృష్ణుడు లేని రాధ విరహోత్కంఠితయై పడే వియోగబాధ వర్ణించబడింది. ప్రియుడి విరహంతో ప్రియురాలు దగ్ధమవుతున్నట్లుగా భావించడం అష్టవిధ నాయికా లక్షణాలలో ఒకటి. 


సా విరహే తవ దీనా –

(రాధ విరహం చేత నీ భావనలో లీనమై ఉన్నది.)


అవిరల నిపతిత మదనశరా దివ భవదవనాయ విశాలం

స్వహృదయ మర్మణి వర్మ కరోతి సజల నలినీదలజాలం

సా విరహే తవ దీనా – 


(మన్మథుడేమో విడువకుండా పుష్పబాణాలను ఎక్కుపెడుతున్నాడు. నీకేమవుతుందోనని ఆ శరాఘాతాలు నీ మీద పడకుండా, నీ రూపాన్ని భద్రంగా తన హృదయాంతరాళాలలో రాధ దాచుకున్నది.)


కుసుమవిశిఖశరతల్ప మనల్ప విలాస కలా కమనీయం

వ్రత మివ తవ పరిరంభసుఖాయ కరోతి కుసుమ శయనీయం

సా విరహే తవ దీనా –


(నీవెప్పుడు వస్తావో అని తహతహలాడుతూ పూలపానుపుని పరిచి వుంచింది. ఆ పడకపై నిన్ను కౌగిలించుకొని ఆనందంగా పడుకోవాలని రాధ కలలు కంటున్నది.)


వహతి చ వలిత విలోచన జలధర మాననకమల ముదారం

విధు మివ వికటవిధుంతుద దంత దలన గలితామృతధారం

సా విరహే తవ దీనా 


(గ్రహణ సమయములో రాహువు కొరికినప్పుడు స్రవించే అమృతబిందువులతో ప్రకాశించే చంద్రునిలా రాధ ముఖం నీకై విలపిస్తూ వున్నది.)


విలిఖతి రహసి కురంగమదేవ భవంత మసమ శరభూతం

ప్రణమతి మకర మధోవినిధాయక కరేచ శరం నవచూతం

సా విరహే తవ దీనా –


(ఏకాంతములో కస్తూరితో నిన్ను మదనమనోహరునిగా చిత్రిస్తున్నది. తరువాత మకరధ్వజాన్ని, మామిడి చిగురును రచించి మన్మథా ఇహ నన్ను బాధించకు, నీకొక నమస్కారమంటున్నది.)


ధ్యానలయేన పురః పరికల్ప్య భవంత మతీవ దురాపం

విలపతి హసతి విషీదతి రోదితి చంచతి ముంచతి తాపం

సా విరహే తవ దీనా – 


(రాధకు మనసులో సదా నీవే. ఎప్పుడూ ఆమెకు నీ తలపే. నవ్వుతుంది; ఏడుస్తుంది; అటూ యిటూ తిరుగుతుంది. పిచ్చి పట్టినదానివలె ఉన్నది రాధ.)


ప్రతిపద మిద మపి నిగదతి మాధవ తవచరణే పతితాऽహం

త్వయి విముఖే మయి సపది సుధానిధి రపి తనుతే తనుదాహం

సా విరహే తవ దీనా – 


(ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు నీ పేరునే ఆమె జపిస్తుంది. నీ ఉదాసీనత వల్ల ఆమెను చంద్రుడు కూడా కాల్చి వేధిస్తున్నాడు.)


శ్రీజయదేవ భణిత మిద మధికం యది మనసా నటనీయం

హరివిరహాకుల వల్లవయువతిసఖీ వచనం పఠనీయం

సా విరహే తవ దీనా – 


(రాధ వియోగబాధను శ్రీకృష్ణునికి సవివరముగా తెలిపిన జయదేవ విరచితమైన రాధ చెలి పలుకులు సదా పఠనీయములు.)


శా. ఆవాసో విపినాయతే ప్రియసఖీ మాలాऽపి జాలాయతే

తాపోऽపి శ్వసితేన దావదహనజ్వాలాకలాపాయతే

సాऽపి త్వద్విరహేణ హంత హరిణీరూపాయతే హా కథం

కందర్పోऽపి యమాయతే విరచయన్ శార్దూలవిక్రీడితం


(రాధ ఇల్లు అడవిలా వున్నది. ప్రియసఖులను కూడా సహించుట లేదు. వెచ్చని ఊపిరులు వదులుతున్నది. మన్మధుడు జింకను వేటాడే పులిలా ఆమెతో ఆడుతున్నాడు.)


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!