యాజమాన్య నైపుణ్యాలు! (లేక ఏమిలేని అయ్య ఊట్టి కిఎక్కుట.)

యాజమాన్య నైపుణ్యాలు!

(లేక ఏమిలేని అయ్య ఊట్టి కిఎక్కుట.)

.

తండ్రి: (కొడుకుతో) నాన్నా! నేనో అమ్మాయిని చూశాను. నువ్వు వెంటనే పెళ్ళిచేసుకోవాలి.

కొడుకు: ఉన్న ఫళాన పెళ్ళా! అదెలా సాధ్యం. 

తండ్రి: మరొక్క సారి ఆలోచించుకో! వచ్చిన సంబంధం బిల్ గేట్స్ కూతురు 

కొడుకు: అలాగే

(తండ్రి బిల్ గేట్స్ వద్దకెళ్ళి)

తండ్రి: మావాడు మీ అమ్మాయిని పెళ్ళిచేసుకోవాలి! 

బిల్ గేట్స్: అసంభవం!

తండ్రి: మరోసారి ఆలోచించుకొండి! మావాడు స్విస్ బ్యాంకు సీయీఓ. 

బిల్ గేట్స్: ముహూర్తాలు పెట్టించండి!

(తండ్రి స్విస్ బ్యాంకుకెళ్తాడు)

తండ్రి: మావాడిని మీ బ్యాంకు సీయీఓ గా నియమించాలి!

బ్యాంకు: అదెలా? అసంభవం! అసాధ్యం!

తండ్రి: మరోసారి ఆలోచించుకొండి! మావాడు బిల్ గేట్స్ అల్లుడు,

బ్యాంకు: ఓహ్! నియామక పత్రాలు తీసుకెళ్ళండి! 

@

ఇది హర్షాద్ మెహతానుండి రామలింగరాజుదాకా అనుసరించిన పాఠం 

“వీళ్ళందరి గతి ఏమైంద”ని మనలాంటివాళ్ళు ఎకెసెక్కంగా అడిగితే

“రిలయంస్‌ మాదిరిగా నీరా రాడియా లాంటి పీ ఆర్ ఓ ని నియమించుకోవాలి” 

ఇదో కొనసాగింపు పాఠం.!!!!!!


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!