శిథిలాలయమ్ములో శివుడు లేడోయి-

ఎన్నాళ్ళయ్యిందండీ..కృష్ణ శాస్త్రి గారి పాట విని ,

(ఇక్కడ కృష్ణ శాస్త్రి గారి భావన శిధిలావస్థలో 

ఉన్న శరీరం లో ప్రాణం ఉన్నా లేకున్నా ఒకటే.)

.

శిథిలాలయమ్ములో శివుడు లేడోయి-

ప్రాంగణమ్మున గంట పలుకదోయి

.

దివ్యశంఖము గొంతు తెరువ లేదోయి- 

పూజారి గుడి నుండి పోవలేడోయి

.

చిత్ర చిత్రపు పూలు చైత్ర మాసపు పూలు-

ఊరూర నిటింట ఊరకే పూచాయి

.

శిథిలాలయమ్ము లోశిలకెదురుగా పూలు- 

పూజారి కొకటేని పూవు లేదోయి

.

వాడవాడల వాడె జాడలన్నిట వాడె-

ఇంటి ముంగిట వాడె ఇంటింటి లో వాడె

.

శిథిలాలయమ్ము లో శిలను సందిట బట్టి- 

పూజారి వాని కై పొంచి ఉన్నాడోయి.

..

దేవులపల్లి వారి పాట యేదయినా సరే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంటాయి. 

.

("అడుగడుగున గుడి ఉందీ - అందరిలో గుడి ఉందీ, 

నిదురించే తోటలోకీ పాట ఒకటి వచ్చిందీ, 

రాయినయినా కాక పోతిని రామ పాదము సోకగా,

ఆకులో ఆకునై, వగైరా పాటలు)

Comments

  1. నిదురించే తోటలోకి---- శేషేంద్రగారిరచన.
    రాయినైనాకాకపోతిని.....
    ఆరుద్ర రచన

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!