పోతన - శ్రీమద్భాగవతం !... జనయిత్రి.!

పోతన - శ్రీమద్భాగవతం !... జనయిత్రి

.

జనయిత్రి గర్భమందును

ఘనక్రిమివిణ్మూత్రరక్తగర్భములోనన్

మునుగుచు జఠరాగ్నిని దిన

దినమును సంతప్యమానదేహుండగుచున్

.

పద విభాగం: జనయిత్రి, గర్భమందును, ఘన, క్రిమివిత్, మూత్ర, రక్తగర్తము, లోనన్, మునుగుచు, జఠరాగ్నిని, దినదినమును, సంతప్యమాన, దేహుండు, అగుచున్

భావం

: ఓ తల్లీ! మనిషి.. తల్లి గర్భంలో ప్రవేశించి, అందులో ఉన్న దట్టమైన క్రిమి సమూహాలతో,

రక్త మల మూత్రాలతో నిండి ఉన్న గుంటలో పడి, అక్కడ జఠరాగ్నితో రోజురోజూ పెరుగుతూ, బాధలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!