మనకు తెలీని భమిడి పాటి కామేశ్వర రావు మేస్టారు.! .

మనకు తెలీని భమిడి పాటి కామేశ్వర రావు మేస్టారు.!
.
కామేశ్వర రావు గారు పశ్చిమ గోదావరి జిల్లా ఆకి వీడులో జన్మించారు . తండ్రికి అరవయ్యవ ఏట రావు గారు పుట్టారు . జన్మ తేది 30-4-1897.నర్సా పురం టేలర్ స్కూల్ లో కొంతకాలం చదివి ,కాకినాడ పిఠాపురం కాలేజి లో ఇంటర్ పూర్తీ చేసి ,రాజ మండ్రి ఆర్ట్స్ కాలేజి లో గణితం లో డిగ్రీ పొందారు .. అక్కడే టీచర్స్ ట్రయినింగ్ పాసై వీరేశలింగం స్కూల్ లో లెక్కల మేష్టారు గా 31ఏళ్ళు పని చేసి 1953లో పదవీ విరమణ చేశారు . అయిదేళ్ళ తర్వాత కేన్సర్ వ్యాధి తో 25-8-1958న మరణించారు . ఆయనకు ”కారా కిళ్ళీ ”వేసుకొనే అలవాటు బాగా ఉండేది అదే ఆయన గొంతు కేన్సర్ కు కారణమై చని పోవటం బాధా కరం .
శుభ్రమైన అంచు ఉన్న తెల్లటి ధోవతీ ,తెల్ల చొక్కా ,దాని పై గోధుమ రంగు కోటు బూట్లు నెత్తిన టోపీ ఇదీ ఆ రోజుల్లో భ కా. రా మేస్టారి వేషం . తెల్ల వారు ఝామున నాలుగింటికి లేచి గోదావరి లోస్నానం చేసి ,వరవర రావు హోటల్లో టిఫిన్ చేసి కాఫీ తాగి ,”కారా కిళ్ళీ ”బుగ్గన బిగించి ”ఇంటికెళ్ళే వారు తొమ్మిదింటికి భోజనం చేసి పదింటికి స్కూల్ కు చేరే వారు .కపి లేశ్వరాపురం జమీందారు గారి పెద్దబ్బాయి యెస్.పి.బి.పత్తభి రామా రావు కు లెక్కలు సరిగ్గా అర్ధం కావటం లేదని ఇంటికిట్యూషన్ కోసం పమ్పిస్తాననిఆయన తండ్రి కబురు చేశారు దానికి మన మేస్టారి సమాధానం ”మీ వాడు లెక్కలు సరిగ్గా చెయ్యటం లేదంటున్నారు అంటే అతనికి అర్ధం అయ్యేటట్లు నేను లెక్కలు చెప్పటం లేదని నాకు అర్ధమయ్యింది. అర్ధం అ యెట్లు చెప్పటం నా బాధ్యత ధర్మం .దీనికి నాకు డబ్బేమీ ఇవ్వక్కర్లేదు ”అని చెప్పి అతని పై ప్రత్యెక శ్రద్ధతో లెక్కలు బోధించి తీర్చి దిద్దారుఆఅయనె ఆ తర్వాతవిద్యా మంత్రి అయ్యాడని మనకు తెలుసు
ఒక సారి స్కూల్ లో మేస్టారి అబ్బాయి రాధా కృష్ణ కూడా చదివె రోజుల్లో పరీక్ష పేపరును ఆత ను పధకం ప్రకారం దోగిలించి మిగిలిన స్నేహితులకిచ్చాడు ఇది చాల రహస్యం గా చేశాడు పండితపుత్రుడు ంఅమ ర్నాదు పరీక్షలో బ్రహ్మాండం గా లెక్కలు చేయచ్చని చంకలు గు లుద్దు కొన్నారు మిత్ర బృందం కాని క్వేస్చిన్ పేపర్ చూసి నీళ్ళు కారి పోయారు తము తస్కరించిన పేపర్ బదులు కొత్త పేపర్ ఇచ్చారు . మేస్తారిద్రుస్తి అంత నిశితం గా ఉండేది దీని పై కొడుకు రాధా కృష్ణ ”నాలుగు తిట్టి ,రెండు తగిలించినా బావుండేది .ఒక్క మాట అనకుండా శిక్ష మాలు చేశారు నాన్న ”అని బావురు మన్నాడు ఱాధా కృష్ణ గొప్ప హాస్య రచయితా .యెన్నొ సినిమాలకు మాటలు రాసి మెప్పించిచి హాస్య రచయిత.
రాధా కృష్ణ కు చిన్నప్పటి నుంచి సినిమాలు చూడటం సరదా
తండ్రి నడిగి డబ్బులు తీసుకొని వెళ్లి చూసోచే వాడు మేష్టారు ఇంగ్లీష్ సినిమాలు బాగా చూసేవారు వారానికి ఒకటైనా చూసేవారు తనతో కొడుకునీ తీసుకొని వెళ్ళే
ఒక రోజు కొడుకు సినిమాకు డబ్బు లడి గాడు .వద్దని చెప్పకుండా మేస్టారు”సినీ గీతోపదేశం” చేశారు ఇలా ”పరీక్షలైనాసరే ,పరీక్ష తప్పినా సరే ఏది ఏమైనా సినిమాలుటం మానకు . . పరీక్ష ఎలాగూ పోతుంది ఉద్యోగం రాదన్న బెంగ లెదు.నిన్ను రోజూ హాలు వాళ్ళు చూస్తూనే ఉన్నారు కనుక పిలిచి టికెట్లు గేటుద గ్గర చించే ఉద్యోగం ఇస్తారు.పెల్లి కాదనే చింతా అక్కర్లేదు ఆడ వాళ్ళ గేటు దగ్గర టికెట్లు చించే వాడి కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారు .వీలయితె ముగ్గురు కలిసి టికెట్లు చిమ్పుకొంటు బతికేయ్యచ్చు .తప్పకున్దా సినిమాకి వెళ్లి రా నాన్నా “‘అన్నారు బుర్ర వాచీ పోయింది రాధాకృష్ణ ‘మళ్ళీ సినిమా మాటెత్తితే ఒట్టు . అదీ మేస్టారి మార్కు ట్రీట్ మెంటు .

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!