కఠోపనిషత్ - 7 (జూన్ 10) యోగ పరిభాష శరీరము, దేహము, క్షేత్రము, The body

Vvs Sarma
కఠోపనిషత్ - 7 (జూన్ 10)
యోగ పరిభాష
శరీరము, దేహము, క్షేత్రము, The body
1. స్థూలశరీరము – The gross body ఇంద్రియ గోచరము, నశ్వరము, పంచభూతాత్మకము ఐన శరీరము - The gross or material and perishable body, with which a soul clad in its subtle body, is invested
2. సూక్ష్మశరీరము = లింగశరీరము -- The subtle body అంగుష్ఠమాత్ర ప్రమాణము, దేహరూపము కలిగిన జీవుడే సూక్ష్మ శరీరరూపమున సమస్త దైహిక క్రియలు చేయుచూ, పుణ్యపాప కర్మలను ఆచరిస్తూ జన్మాంతరమందు సుఖ దుఃఖములను సంపాదించు కొనుచున్నాడు. – The subtle body of the soul (jiva), the miniature model of the gross or visible body, which is not destroyed by death and is said to accompany the soul in its transmigration
స్వర్గ నరకవాసములకు ఈ సూక్ష్మ శరీరమే భోగ శరీరముగాను, యాతనా శరీరముగాను రూపుచెందును. (akin to wearing appropriate dresses)
3. కారణశరీరము – The causal body, అజ్ఞానరూపమైన దేహము, స్థూలసూక్ష్మదేహములకు లోపల ఉండి మఱొక దేహమును ఇచ్చుటకు హేతువైన దేహము. The causal body is due to avidya and maya the root cause of the gross and subtle bodies
ఆత్మ - జీవాత్మ - పరమాత్మ
జీవాత్మ, జీవుడు, దేహి, శారీరకుడు, అంగుష్ఠమాత్ర పురుషుడు, క్షేత్రజ్ఞుడు (ప్రేత, పరేత)
జీవుడు దేహాంతర్యామి. అంగుష్ఠ మాత్రుడు. సూక్ష్మశరీరధారి. ఇది దేహ రూపమును కలిగియుండును. పుణ్య, పాప కర్మలను ఆచరించి ఉతర జన్మయందు సుఖదుఃఖములు సంపాదించుకొనును. దైహిక క్రియలలో తాదాత్మ్యము పొందును. ఇది కర్త, భోక్త. ఇక పరమాత్మస్థితి ఎక్కడ? ఈ అంగుష్ఠమాత్ర జీవుని కేంద్రమున బిందు రూపముగా పరమాత్మ ఉపస్థితమై ఉన్నది. దీని వలననే జీవుని జీవయాత్రాక్రియలు, సుఖదుఃఖానుభవములు కలుగుచున్నవి. పరమాత్ముడు కర్త కాడు, భోక్తకాడు, సాక్షిమాత్రుడు.
దేహాత్మ భావన
ఈ శరీరమే తానను జీవభావము. ఈ దేహాత్మ భావనను వదలి మనోబుద్ధి,చిత్తాహంకారములను వశముచేసికొనినచో ఈ సూక్ష్మశరీరమైన జీవుడు తనయుందున్న పరమాత్మను దర్శించి విశ్వవ్యాప్తుడు కాగలడు. ఈ జీవుడే సాధకుడు, ఉపాసకుడు. స్థూల శరీరము ప్రాణమున్ననూ జడమైన యంత్రమే.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!