దాశరథీ శతకము........ రామదాసు.

శ్రీ రమణీయహార,యతసీ కుసుమాభశరీర,భక్త మం
శార,వికారదూర,పరతత్త్వ విహార,త్రిలోకచేతనో
ద్దార,దురంత పాతక వితాన విదూర,ఖరాది దైత్య కాం
తార కుఠార,భద్రగిరి దాశరథీ కరుణా పయోనిధీ.
దాశరథీ శతకము........
రామదాసు.

మంగళకరము,మనోహరమునైన కంఠహారము గలవాఁడా,నూనె యగిసె పూవువలె నల్లని మేనుగలవాఁడా, భక్తులపాలిటి కల్పవృక్షమా, ఇంద్రియ వికారములకు లోనుగాని వాఁడా, మోక్షమార్గమున సంచరించువాఁడా; ముల్లొకములను జైతన్యవంతములు చేయువాఁడా, ఘోర పాపసమూహమునకు మిక్కిలి దవ్వయినవాఁడా, ఖరుఁడు మున్నగు రాక్షసులనెడి యడవికి గొడ్డలియైన వాఁడా, భద్రాద్రిరామా, దయాసముద్రా.

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.