సోమనాథ లింగ విశిష్టత.

శివ మహాపురాణం

సోమనాథ లింగ విశిష్టతని చెబుతూ గురువు గారు ఈ కధ చెప్పారు.

దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు, వారే 27 నక్షత్రాలు. ఆయన కుమార్తెలనందరిని చంద్రుడికి ఇచ్చి వివాహం చేసారు. కానీ చంద్రుడు మాత్రం ఎక్కువగా రోహిణితో కాలం గడుపుతూ ఉండేవాడు. ఈ విషయం మిగిలిన కుమార్తెలకి నచ్చక తండ్రి గారికి ఫిర్యాదు చేసారు. తండ్రి గారు వెళ్లి, అల్లుడితో మాట్లాడారు, అల్లుడుగారు సరే మామగారు అందరితో కాపురం చేస్తాను అని అన్నాడు. కానీ అల్లుడి గారి ప్రవర్తనలో మార్పు రాలేదు. దక్షుడుకి కోపం వచ్చి చంద్రుణ్ణి నువ్వు క్షయ వ్యాధితో బాధపడుగాక అని శపించాడు. దీని వల్ల
దేవతలకు ఆహారం లేదు. ఎందుకని? చంద్రుడు బాగా ప్రకాశిస్తే ఓషధులు బాగా ప్రకాశిస్తాయి. ఆ ఓషధులతో కూడిన ద్రవ్యంతో యజ్ఞం చేస్తే,వాటిని హవిస్సుగా దేవతలు స్వీకరిస్తారు. ఈ సమస్యకి పరిష్కారం కోసమని, పెద్దాయన దగ్గరకు వెళ్ళారు. ఆయనే చతుర్ముఖ బ్రహ్మ గారు. ఆయన చంద్రుణ్ణి పరమ శివుడి కోసం తపస్సు చెయ్యమన్నారు. చంద్రుడు అలాగే అని అన్నాడు. చంద్రుడి తపస్సు పరిపక్వత చెందాక, పరమ శివుడు ప్రత్యక్షమయ్యాడు.

పరమ శివుడికి తెలియదా, చంద్రుడు ఎందుకు తపస్సు చేసాడో? పెట్టినా తండ్రే, కొట్టినా తండ్రే కదండీ? ఇప్పుడు ఆయన కర్తవ్యం ఏమిటి? చంద్రుణ్ణి ఉద్ధరించాలి. పాప విముక్తుణ్ణి చెయ్యాలి.

అప్పుడు చంద్రుడికి చేసిన పాపం పూర్తిగా తీసేయకుండా నువ్వు 15 రోజులు పెరుగుతావు మళ్లి 15 రోజులకు తరుగుతావు. కానీ ఈ వ్యాధి వల్ల నసించిపొవు. చంద్రుడు సంతోషించి, తండ్రి నువ్వు నన్ను ఉద్ధరించావు కనుక నువ్వు ఇక్కడే కొలువై ఉండు అని అర్ధించగా, పరమ శివుడు పార్వతీ సమేతుడై ప్రత్యక్షమయ్యాడు.

అందుకే స + ఉమ + నాధుడు = సోమనాధుడు

(పార్వతీ సమేతుడై సోముడిగా వెలిసాడు.)

నువ్వు చేసిన తపస్సుకు మెచ్చాను కాబట్టి, నిన్ను నా తలమీద పెట్టుకుంటాను. అందుకే ఆయనకు శసి శేఖరా లేక చంద్ర శేఖర అని పేర్లు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!