కన్యాశుల్కం(గురుజాడ అప్పారావు గారు)

కన్యాశుల్కం(గురుజాడ అప్పారావు గారు)

ఇల్లు ఇల్లనియేవు ఇల్లు నాదనియేవు
నీ ఇల్లు యెక్కడే చిలుకా
ఊరికీ ఉత్తరాన కామాటిపురములోన
కట్టె ఇల్లున్నదే చిలుకా ||కట్టె||
ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే
కొణ్ణాళ్ళ ఓ రామ చిలుకా ||కొణ్ణాళ్ళ||
మూణ్ణాళ్ళ బ్రతుకునకు మురిసేవు త్రుళ్ళేవు ||మూణ్ణాళ్ళ||
ముందు గతి కానవే చిలుకా
కర్రలే చుట్టాలు కట్టేలే బంధువులు
కన్న తల్లెవ్వరే చిలుకా ||కన్న||
మోసేరు నలుగురు వెంబడి పది మంది
నిన్ను మోసేరు నలుగురు వెంబడి పది మంది
వేంటనెవరూ రారు చిలుకా
కాలిపోయేదాక కావలి ఉందురు కాని
నువ్వు కాలిపోయేదాక కావిలుందురు కాని
కడకు తలగొట్టురే చిలుకా
వేంటనెవరూ రారు చిలుకా

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!