కేదార్ నాథ్ ఆలయ ప్రాస్తిత్యం.. చెక్కు చెదరని కేదార్ నాథ్ ఆలయం..

Venu Gopal Nellutla ::
కేదార్ నాథ్ ఆలయ ప్రాస్తిత్యం..
చెక్కు చెదరని కేదార్ నాథ్ ఆలయం..

ఉత్తరాఖండ్ వరదల వల్ల కేదార్ నాథ్ లో తీవ్రమైన ఆస్థి, ప్రాణ నష్టం జరిగింది. వంతెనలు, పెద్ద పెద్ద కట్టడాలు వరదల తాకిడికి కొట్టుకుపోయాయి. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న సమాచారం ప్రకారం..దాదాపు 15 అడుగులు ఎత్తు వరద నీరు, బురద, బండ రాళ్ళు కొట్టుకొచ్చి సమస్తాన్ని ఊడ్సేశాయి. ఆలయ పరిసరాల్లోని భవనాలు అనేకం నేల మట్టం అయ్యాయి. కానీ కేదార్ నాథ్ ఆలయగోడలు మాత్రం కాస్తంతయినా కదల్లేదు. ఈ నేపథ్యంలో ఆ ఆలయన్ని ఇంత పటిష్టంగా ఎవరు, ఎప్పుడు నిర్మించారనేది ఆసక్తిని కలిగించేది. ఉత్తరాఖండ్ ప్రభుత్న వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపుగా 1200 యేళ్ళ క్రితం ఆది శంకరాచార్యుల వారు పాండవులు కట్టించినట్లు నమ్ముతున్న కేదార్ నాథ్ ఆలయాన్ని పునర్నిర్మించారు.
ప్రచారంలో ఉన్న ఒక కథ ప్రకారం అసలు ఆలయాన్ని కట్టించింది పంచ పండవులు. దీని ప్రకారం చూస్తే ..కురుక్షేత్ర మహాసంగ్రామంలో విజయం సాధించినప్పటికీ పాండవులకు మనశ్శాంతి లేకుండా పోయింది. యూద్దంలో సోదరులను, బంధువులను, మిత్రులను, అసంఖ్యాంగన వధించి పాపాలను మూట గట్టుకున్నామని బాధపడుతుంటారు. అందుకు విరుగుడుగా కృష్ణుడి సలహా అడుగుతారు. కైలాసనాథుని దర్శించుకుంటే పాపాల నుండి విముక్తం లభిస్తుందని సూచిస్తాడు. దీనితో పరమ శివుని దర్శనం కోసం పాండవులు తొలుత గుప్తకాశీకి వెళ్తారు. కానీ శివుడు వారికి దర్శనమీయడానికి ఇష్టపడక వృషభ రూపం దాల్చి గౌరీకుండ్ కు వెళతాడు. దీనితో పాండవులు కూడా గౌరీ కుండ్ కీ బయలు దేరుతారు. వృషభం గౌరీకుండ్ నుంచి కేదార్ నాథ్ కి వెళుతుంది. పాండవులు అక్కడికీ వెళతారు. అయితే వారిని చూడడానికి ఇష్టపడని వృషభం తన తలను మంచులో దూర్చుతుంది. నారదుని ద్వారా ఈ విషయం తెలుసుకున్న భీముడు వృషభాన్ని వెనుకభాగం పట్టుకుని బలవంతంగా బయటకు లాగితే తల తెగి నేపాల్ లో పడుతుంది. ఆ తల నేడు పశుపతి నాథ్ లింగంగా అక్కడ పూజించబడుతుంది. వృషభం మిగతా శరీరం అయిదు ముక్కలై ఐదు ప్రాంతాల్లో పడుతుంది. అందులే వీపు భాగం పడిన ప్రాంతమే నేటి కేదార్ నాథ్ ఆలయప్రాంతం. అక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలుస్తానని' శివుడు పాండవులకు చెబుతాడు. వారు అక్కడ ఆలయాన్ని నిర్మించి హిమాలయాల ద్వారా స్వర్గారోహణం చేస్తారు. ఇప్పటికీ హిమాలయాల్లో స్వర్గారోహణ శిఖరం పేరుతో ఒక శిఖరం ఉంది.
నేటి కేదార్ నాథ్ ఆలయాన్ని 900-1000 మద్యకాలంలో ఆదిశంకరాచార్యులవారు పునర్నిర్మించారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అనంతరం మద్యప్రదేశ్ ఇండోర్ సంస్థానాదీషులు కూడా ఈ ఆలయాన్ని మరింత పటిష్టంగా నిర్మించారు. ఆలయం వెనుక ఆదిశంకరాచార్యుల వారి సమాధి మందిరం ఉంది. ఈ మందిరంలో స్పటిక లింగం, ఆంజనేయుడు, ఆదిశంకరుల విగ్రహాలు ఉన్నాయి. తాజా వరదల్లో ఈ మందిరం పూర్తిగా కొట్టుకుపోయింది.
ఇది కేదార్ నాథ్ ఆలయ ప్రాస్తిత్యం..@ బహుజన బంధు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!