సౌందర్య లహరి! (శ్రీ శంకర భగవత్పాద విరచితము) శ్లోకము (18).

సౌందర్య లహరి!

(శ్రీ శంకర భగవత్పాద విరచితము)

శ్లోకము (18).

-

తనుచ్ఛాయాభిస్తే తరుణ తరణి శ్రీ సరణిభి

ర్దివం సర్వా ముర్వీ మరుణిమ నిమగ్నాం స్మరతియః,

భవన్త్యస్య త్రస్యద్వనహరిణ శాలీన నయనా

సహోర్వశ్యా వశ్యాః కతి కతి న గీర్వాణ గణికాః !!

-

తల్లీ , భగవతీ ! ఉదయిస్తూన్న బాలసూర్యుడి కాంతి 

పుంజాలను వెదజల్లు తూన్న నీ నెమ్మేని కెంజాయలచే

భూమ్యాకాశాలు కెంపు జిగుల మున్నీటిలో మునిగిన 

వానినిగా ఎవడు స్మరిస్తాడో అతడికి మిగుల బెదరిన

లేడికన్నుల అప్సరస కన్యలు ఊర్వశి లోనగు వారెందరెందరు

వశ్యులు కారు? అందరూ వశులవుతారు.

-

ఓం కాత్యాయన్యైనమః

ఓం భద్రదాయిన్యైనమః

ఓం మాంగల్యదాయిన్యైనమః

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!