గజల్ !

గజల్ !

-

కన్నులలో భావాలను పలికించుట నీకు తెలుసు 

పెదవులపై చిరునవ్వును పూయించుట నీకు తెలుసు 

.

నీ నవ్వును చూసినాక మనసు నిలిచి ఉంటుందా 

సంతోషం మనసునిండ పొంగించుట నీకు తెలుసు 

.

మెరుపులాంటి నీ కన్నులు వలపు విరులు పూయించును 

నాగుండెలొ ఆనందం పండించుట నీకు తెలుసు 

.

జాలు వారు నీకురులే జావళీలు పాడుతుంటె

పరిమళాన నా మనసుని రవళించుట నీకు తెలుసు 

.

మనసంతా నిర్మలమై నిలచి వుంది నీ కొరకే 

తన్మయాన మనసులోన వశియించుట నీకు తెలుసు 

నగుమోమే కనులముందు శ్రీ మనసును మురిపించగ 

వన్నెలనే వెన్నెలగా కురిపించుట నీకు తెలుసు 

.

.... 'శ్రీ' నివాస్ నరసింగోలు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!