శ్రీమహావిష్ణువు, తన నిజరూపమును చూపుట !

-

కౌసల్య గర్భవాసమున జన్మించిన

శ్రీమహావిష్ణువు, తన నిజరూపమును చూపుట !

.

ఇందీవర శ్యామ సుందరగాత్రుండు,

దరహాసపూర్ణ వక్త్రంబువాడు,

పురుషార్థముల దెల్పు భుజచతుష్కమువాడు,

పట్టుచేలములతో బరగువాడు,

కరుణామృతము జిల్కు కన్నుదమ్ములవాడు,

వనమాల గళసీమ దనరువాడు,

నవరత్నమయ భూషణమ్ములు గలవాడు,

చిన్మయతేజంబు చెలగువాడు,

వేలుపులకు నెల్ల పెన్నిధియగువాడు,

సాధుబృందములకు సద్గురుండు,

నెల్లలోకములకు నేలిక యగువాడు,

పుత్రుడగుచు గనులముందు నొప్పె!

(శ్రీమదధ్యాత్మ రామాయణము, 

బాలకాండ - 

పండిత నేమాని రామజోగి సన్యాసిరావు.

భావము: 

నల్లకలువ వంటి అందమైన శరీరఛాయ కలవాడు, 

నిండైన చిఱునవ్వుతో వెలుగుతున్న మోమువాడు, ధర్మార్థకామమోక్షములు అనెడు 4 పురుషార్థములకు ప్రతీకలుగా ప్రకాశిస్తున్న చతుర్భుజములవాడు, పట్టువస్త్రములను ధరించినవాడు, చల్లని అమృతమువంటి కరుణాదృక్కులు ప్రసరించే కన్నులవాడు, తులసీదళములమాల కంఠసీమలో వ్రేలాడుతున్నవాడు, నవరత్నమయమైన నగలను ధరించినవాడు, దివ్యతేజముతో ప్రకాశిస్తున్నవాడు, దేవతలందరికీ పెన్నిధి, సాధుసత్తములకు ఉత్తమగురువు, సకల భువనములకు నాథుడైన శ్రీమన్నారాయణమూర్తి, 

కౌసల్యాదేవి భాగ్యవశమున ఆమెకు సుతుడై కనులవిందు చేశాడు...

.

ఆహా! ఆ మహాతల్లి ఎంతటి పుణ్యము చేసుకున్నదో కదా!


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!