Tuesday, November 14, 2017

శబరి సాధన "


-


శబరి సాధన ".

.

ఆటవిక స్త్రీ శబరి గొప్ప భక్తురాలు. అంద విహీనం కారణంగా పెళ్లివారు

పెళ్లి మానేస్తారనే భయంతో రాత్రి చీకట్లో ఆమెకు పెండ్లి చేసి పెండ్లి కుమారునికిఅప్పగించి వెంటనే తీసుకువెళ్లి పొమ్మన్నారట. 

పెండ్లి కొడుకు అలానేచీకట్లో శబరిని తీసుకుని తన గూడెంకు

బయలుదేరాడు. ఆమె భర్త వెనుకనే నడువసాగింది. 

రాత్రంతా చీకటిలో వారలా నడుస్తూండగానే తెల్లవారింది.

అతడు వెనక్కి తిరిగి శబరి కురూపాన్ని చూసి జడుసుకుని ఏదో దయ్యం తనను తినడానికి వచ్చిందనుకుని భయపడి ఆ 

అరణ్యంలో పాపం ఆమెను వదిలేసి పారిపోయాడట. 

అటు పుట్టిల్లు దారి తెలియక ఇటు అత్తవారింటికి వెళ్లలేక

అలాగే అడవిలో ఉండిపోయింది ఆ శబరి.

.

ఆ దండకారణ్యంలో ఇతర మునులు ఆమెను అంటరానిదిగా భావించి తిరస్కరించిననూ మతంగి మహర్షి మాత్రం ఆశ్రయం ఇచ్చాడు.

ఆనాటినుండి శబరి మహర్షులకు సేవలు చేస్తూ ఆనందించసాగింది. రోజూ ఋషులు పంపానదికి వెళ్లే మార్గాన్ని శుభ్రం చేస్తూండేది. రాళ్లున్నచోట ఇసుక పోసి ఎవరికీ గుచ్చుకోకుండా చూసుకునేెది. హోమాలకు కావలిసిన సమిధలను ఏరి తెచ్చేది. 

.

ఒకరోజు శబరి అవసానదశలోనున్న మతంగ మహర్షిని చూసి విలపిస్తూండగా

ఆ మహర్షి ఇలా అన్నాడు. అమ్మాయీ! నీకు దుఃఖము వలదు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన శ్రీరామచంద్రుడే 

నీ దగ్గరకువస్తాడు. నీవు సేవించి తరించవలిసింది అని చెప్పి తనువు చాలించాడు.

అప్పట్నుంచీ శబరి రాముని కై నిరీక్షిస్తున్నది. 

నిరీక్షణ ఎంతో గొప్పసాధన

కదా! ఏ జంతువు అలికిడి చేసినా,గాలికి 

ఏ ఎండుటాకు కదిలినా శ్రీ రాముడే వస్తున్నాడేమోననుకుని 

బయటకు చూసేది.

.

కుటీరము దారి అంతా పూలతో అలంకరించి ఉంచేది. పండిన పళ్లను

కోసి తీసుకువచ్చి వాటిని రుచి చూసి 

పక్వములైనవాటిని రామ ప్రభువుకు నివేదించడానికి సిద్ధంగా వుంచేది. ఆ రోజు రాముడు రాకపోతే, నా ప్రభువు రేపు వస్తాడు అనుకుని

ఇలా ప్రతీరోజూ అన్నీసిద్ధం చేసి రాముడి కోసం నిరీక్షించేది.

సుదీర్ఘమైన ఈ నిరీక్షణలో శబరి సాధన సంపూర్ణమైనది.

మతంగమహర్షి వచనాలను సత్యం చేస్తూ రాముడు శబరిని చూడాలనే ఉత్సుకతతో శబరి

కుటీరంవైపు వడివడిగా చేరుకున్నాడు.

శబరి ఆనందానికి హద్దులు లేవు. ఆ

భగవంతుని చరణాలపై వాలిపోయింది.

చక్కని పళ్లు తీసుకువచ్చి నివేదించింది.

శబరి వృద్ధురాలు. రాముడు చిన్నవాడు.

తల్లి తన బిడ్డకు తినిపించినట్లుగా ఎంతో

ప్రేమతో పళ్లం తినిపించింది. రాముడు అంతకన్న సంతోషంగా వాటిని ఆరగించాడు. సర్వలోకాధినాధుడైన రామప్రభువుకు కడుపునిండా పళ్లు తినిపించి చరితార్థులయినది శబరి. ఆమె సాధన ఈ విధంగా రామదర్శనంతో సంపూర్ణమైనది.

.

(తులసీదాసు విరచిత రామచరిత మానస్ ఆధారంగా)

1 comment:

  1. శబరి గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.

    ReplyDelete