నందినీపరిణయము !


-

నందినీపరిణయము !

-

అన్నదమ్ములు వేరు పడేటప్పుడు యింట్లో ఉన్న 

కుండలను కూడా బయటవేసుకుంటారనేది లోకోక్తి. 

యింట్లో వున్నసామాను యిది అనిచెప్పటానికి కాబోలు.

ఆలోకోక్తిని మరింగంటివారు శశిరేఖా సౌందర్యావిష్కరణంలో యెంతో సముచితంగా వినియోగించుకొన్నాడు.

.

ఉ:ఆయబలామణీతను గృహంబున కాపుర మున్న శైశవ 

ప్రాయము నమ్మరుండు చలపాది తనంబువ నిల్లు వెళ్ళగా 

ద్రోయఁ దలంచి తోడుతనె దొంతులకుండ లురంపు వాకిటన్ 

వ్రేయుగతిన్ కుచంబులు నవీన రుచిం జనియించెఁ బోటికిన్;!

( 2ఆ:-74 వపద్యం)

తా -

మన్మధుడువచ్చి, శశిరేఖ శైశ వాన్ని వెళ్ళగొట్టాడట! 

అంటే శశిరేఖకు యవ్వనం వచ్చిందని భావం. 

అపుడింట్లో ఉన్న దొంతులు బయట వేసికొన్నట్లుగా 

శశిరేఖ ఉరము(ఎద) మనే వాకిలి ముందు వక్షోజాలనే కుండలను బయటకు వేశాడట! 

కవులెంతగా వర్ణించారో చూశారా? 

భావుకత పెరిగితే సంభావనా(ఊహ) శక్తి యిలాగే పెరుగుతుందేమో?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!