దేవరకోట! '-చాటుపద్యమణిమంజరి - (బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు)_

-

దేవరకోట!
'-చాటుపద్యమణిమంజరి -
(బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు)

-

శ్రీకృష్ణదేవరాయలు ఏకాదశి నాడు పండిత మండలి లో 

పుణ్య కథా గోష్టి చేయుచున్న సమయములో 

కృష్ణరాయలు దాశరథులు గొప్పవారా? పాండవులు గొప్పవారా?

అని ప్రశ్నించి నాడట.

పెద్దన మొదలగు పండితులు తమకు తోచిన రీతిని కొందరు దాశరథులు గొప్పవారని కొందరు పాండవులు గొప్పవారని చెప్పారట.

-

రాయలు వూరుకుండుట జూసి అప్పాజీవారు నీ అభిప్రాయమేమిటి రాయా?అని అడిగినారట.

అప్పుడు కృష్ణదేవరాయలు పాండవులే గొప్పవారు.

ఎందుకనగా దాశరథులు ఈశ్వరాంశమున జన్మించినవారు 

కావున వారికి అమానుష శక్తులు వుండుట వింత గాదు

.పాండవులకు ఈశ్వ రాంశ లేదు అట్లయిననూ వారు 

దాశరథుల తో శక్తుల యందును,యోగ్యత యందును సాటి వచ్చినారు. కావున పాండవులే ఎక్కువ గొప్పవారు యని తన అభిప్రాయము యని అన్నాడట.

అది విని రాయలకు చామరము వీచుచున్న చాకలివాడు 

చేతులు జోడించి 

'దేవరవారు జన్మాంతర మందు వున్ననూ

పాండవుల మీద అభిమానము పోలేదు' అన్నాడట 

(అంటే రాయలు కృష్ణుని అవతారమని) దానికి రాయలు

చాలా సంతోషించి నీకేమి కావలెనో కోరుకొమ్మని అడిగినాడట.

-

అప్పుడు వాడు నాకు 'దేవరకోట'ఏలవలేనని యున్నది అన్నాడట. రాయలు అప్పుడే వానికి 'దేవరకోట' సీమను ఏలుకొమ్మని యనుజ్ఞ 

యిచ్చినాడట,

తర్వాత ఆ దేవరకోట సీమను కమ్మ జమీందారులు పాలించారట.

కానీ ఆ సంస్థానము వున్నంత వరకూ వారు చాకలివాళ్ళతో 

పల్లకీని మోయించే వారుకాదట.మరియు మొహర్లు(నాణెములు) వేసే సీలు చాకలి వారి వద్దనే వుంచుటయు ఆచారముగా వుండేదట.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!