మారేడు లేదా బిల్వము (Bael)

మహా శివరాత్రి శుభాకంక్షలు!

మారేడు లేదా బిల్వము (Bael) హిందూ దేవతలలో 

ఒకడైన శివపూజలో ముఖ్యం. * శివుని బిల్వ పత్రములతో పూజించుట శ్రేష్టము

బిల్వ వృక్షము సాక్షాత్తు శివస్వరూపమని దేవతలు భావించెదరు.

శివపురాణంలో బిల్వపత్రం యొక్క మహిమను తెలిపే కథ ఉన్నది

. ఒకనాడు శనిదేవుడు, శివుని దర్శించుటకై కైలాసమునకేగి పార్వతీ పరమేశ్వరులను దర్శించి భక్తితో స్తుతించాడు. అంతట శివుడు శనిదేవుని విధి ధర్మమును పరీక్షించు నెపమున నీవు నన్ను పట్టగలవా? అని ప్రశ్నించినాడు.

అందుకు శని మరునాటి సూర్యోదయము నుండి సూర్యాస్తమయ కాలము వరకూ శివుని పట్టి ఉంచగలనని విన్నవించాడు. అంత శివుడు మరునాటి ఉషోదయ కాలమున బిల్వవృక్షరూపము దాల్చి, ఆ వృక్షమునందు అగోచరముగా నివసించాడు.

మహేశ్వరుని జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరు ముల్లోకములనూ గాలించారు. వారెవ్వరికి ఆ మహేశ్వరుని జాడగానీ, శనిదేవుని జాడగానీ తెలియలేదు.

.

ఆనాటి సూర్యాస్తమయ సంధ్యాకాలము గడచిన పిదప మహేశ్వరుడు బిల్వ వృక్షము నుండి సాకార రూపముగా బయలు వెడలినాడు

. మరుక్షణమే శనిదేవుడు అచట ప్రత్యక్షమైనాడు. "నన్ను పట్టుకోలేకపోయావే?" అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి

"నేను పట్టుటచేతనే గదా, లోకారాధ్యులు తమరు ఈ బిల్వ వృక్షరూపముగా ఇందులో దాగి వసించినారు" అన్నాడు. 

శనిదేవుని విధి నిర్వహణకు, భక్తి ప్రపత్తులకు మెచ్చిన శివుడు "ఈశ్వరుడినైన నన్నే కొద్దికాలము పట్టి, నాయందే నీవు వసించి యుండుటచేత నేటినుండి 

నీవు 'శనీశ్వరుడు' అను పేర ప్రసిద్ధి నొందగలవు. అంతట శని దోషమున్న వారు, ఆ దోషమున్నవారు, ఆ దోషపరిహారార్ధము నన్ను బిల్వ పత్రములలో పూజించిన దోష నివృత్తి జరుగును. బిల్వ పత్ర పూజ చేత శివభక్తులైన వారిని ఈ శనీశ్వరుడు బాధించడు' అని అభయమిచ్చెను.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!