భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవంగా చూసుకొంటూ.. నలుగురిలో చులకన కాకుండా... చూసుకొంటూ... జీవితాన్ని హ్యాపీగా కొనసాగించుకోవాలి.

భార్య గాని, భర్త గానీ... తమ తమ ఆధిక్యతను ప్రదర్శించే సమయంలో యేదో ఒకటి అనేస్తూ వుంటారు. అలాంటి ప్రవర్తన వలన..... తన జీవిత భాగస్వామి యెదుటి వారి దృష్టిలో ఎంత లోకువ అవుతారో గమనించాలి. భార్యా భర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి. ఒకరి లోపాలను ఒకరు ఏకాంతంలో సరిదిద్దుకోవాలి భార్యా భర్తలన్నాక.. పాలూ నీళ్ళలా ఒకరికొకరు కలిసిపోవాలి.. అంతే గాని ఒకరి లోపాలను మరొకరు ఇతరుల ముందు ఎత్తిచూపడం ఎంతవరకు సమంజసం.... ! 

.

సున్నితమైన విషయాలలో... ఇలాంటి సందర్భాలు... చిలికి చిలికి... గాలివానగా మారి, వారి జీవితాలలో తుఫానులు సృష్టించే అవకాశం వుంది...

భర్త ఎంతటి అసమర్ధుడైనా. .... దానికి గోరంతలు కొండంతలు చేసి.... పొరుగు వారితో చెప్పటం మంచిదికాదు.

భార్య తన కంటే తక్కువ అనే భావంతో నలుగురు ముందు వ్యంగ్యంగా మాట్లాడటం హర్షణీయం కాదు.భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవంగా చూసుకొంటూ.. నలుగురిలో చులకన కాకుండా... చూసుకొంటూ... జీవితాన్ని హ్యాపీగా కొనసాగించుకోవాలి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!