స్వర్ణముఖి నది.!

స్వర్ణముఖి నది.!

పూర్వం అగస్త్య మహర్షి బ్రహ్మను గురించి తపస్సుచేసి ఈ నదిని దేవలోకం నుంచి క్రిందికి తెప్పించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తున్నది. 

శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని నిర్మించేటపుడు ఆలయ నిర్మాణంలో 

సహకరించిన కూలీలు రోజూ సాయంత్రం నదిలో స్నానం చేసి ఇసుక వారి చేతుల్లోకి తీసుకుంటే అది వారికి కష్టానికి తగిన ప్రతిఫలం విలువచేసేంత బంగారంగా మారేది. 

అందుకే ఈ నదికి స్వర్ణముఖి అని పేరు వచ్చింది.

సువర్ణముఖి నది అగస్త్యుని తపోభంగం కలిగించగా అగద్త్యుడు స్వ

ర్ణముఖినీ నదిని శపించాడు. అందువలన నదిలో నీరు ఇంకిపోయింది. అయినప్పటికీ అంతర్వాహినిగా ప్రవహిస్తున్న కారణంగా నదీసమాంలో ఉన్న బావులలో నీరు ఇంకిపోదు. 

నదీతీరంలో విపరీతంగా మొగలి పొదలు పెరిగిన కారణంగా స్వర్ణముఖీ నదికి " మొగలేరు " అనే మరొకపేరు కూడా వచ్చింది. 

ఈ నదికి పలు వాగులు, వంకలు, ఏరులూ జలాలను ఆందిస్తున్నాయి. 

వాటిలో కల్యాణీ, భీమానదులు ప్రధానమైనవి. కల్యాణీ నదీతీరంలో శ్రీనివాసమంగాపురంలో కల్యాణశ్రీనివాసుడు వెలసి పూజలందుకుంటున్నాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!