సుందర కాండం - హనుమాయణం ! (Vvs Sarma గారికి కృతజ్ఞతలతో..)

సుందర కాండం - హనుమాయణం !

(Vvs Sarma గారికి కృతజ్ఞతలతో..)

మనం వేగాన్ని గురించి gaమాట్లాడినప్పుడు మూడు పదాలను ఉపయోగిస్తాం - 

శర వేగం, వాయువేగం, మనోవేగం. హనుమంతుడు లంకకు లంఘించినప్పుడు 

ఒకచోట గరుడుని వలే ఎగురుతున్నాను అంటాడు హనుమ. మహేంద్ర పర్వతం నుండి లంకా తీరానికి ప్రయాణంచేసినప్పుడు ఆయన వేగమెంత? సమయమెంత పట్టినది? ఆయన గగన ప్రయాణ మార్గం (flight path) ఏది? 

.

మనోజవం మారుతతుల్య వేగం 

జితేంద్రియం బుద్ధిమతా వరిష్ఠం 

వాతాత్మజం వానరయూధ ముఖ్యం 

శ్రీరామ దూతం శరణం ప్రపద్యే

.

హనుమంతుడు వాతాత్మజుడు (వాయు పుత్రుడు) వాయువేగముతో చరించగల సమర్థుడు. బుద్ధిమంతుడు. మనోవేగముతో చరింపగల వాడు. జితేంద్రియుడు మహాయోగి. ప్రాణమును నియంత్రణచేసి జీవుడైన అంగుష్ఠమాత్ర పురుషుని శరీరమునకు బాహ్యముగా తీసుకొని రాగలడు. రాముని దూత. రామబాణమువలె శరవేగమున సంచరించగలవాడు. ఆయనను శరణువేడిన తక్షణమే రక్షణ దొరకును

..

భౌతిక శాస్త్రజ్ఞులకు మనము పైన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు సుందరకాండం ప్రథమ సర్గ శ్రద్ధగా చదివితే అక్కడే లభిస్తాయి. మొదటిశ్లోకం 

తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్శనః 

ఇయేషు పరమన్వేష్టుం చారణా చరితే పథి. }

.

రావణుడు అపహరించిన సీతను అన్వేషించుటకై చారణులు సంచరించు ఆకాశ మార్గమున ప్రయాణము చేయుటకు శత్రువులను కృశింపచేయు హనుమంతుడు నిశ్చయించెను

ఎవరీ చారణులు? ఎక్కడ ఉంటారు?

चारण = देवानां गायनास्ते च चारणाः स्तुति पाठकाः “गन्धर्वाणां ततो लोकः परतः शत योजनात्

చారణులు దేవతల స్తోత్రాల గాయకులు, గంధర్వలోకానికి సమీపంలో 100 యోజనాలు (సుమారు 30 కి.మీ ) దూరంలో వారిలోకం ఉంటుంది.

భారత దేశం నుండి లంకాతీరం దూరం 100 యోజనాలు సుమారు 30 కి.మీ. యోజనం 8 మైళ్ళు అనేది తప్పులెక్క. ఆచార్యకవనశర్మగారి లెక్క 400 మీ. చారణులు సంచరించే మార్గము సుమారు విమాన మార్గములకు సమీపంలోనే ఉండవచ్చును (5-8 కి.మీ.) . వాయువేగము అత్యధికం గంటకు 100-200 కిమీ (హుడ్ హుడ్ వేగం) 

శరవేగంకూదా సుమారు అంతే. మనోవేగం లెక్కలు వేరే మంత్రం, చందస్సు ఈలెక్కలో సహకరిస్తాయి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!