ఇదేనా భరత దేశం ..ఇదేనా మన సంస్కృతి?

ఇదేనా భరత దేశం ..ఇదేనా మన సంస్కృతి?


ఓ తల్లిని కళ్లారా చూశాను....తన కొడుకు కోసం కటిక ఉపవాసాలు వుండి, విష్ణు సహస్రనామం, గోవిందుని సహస్రనామం చేసేది...పెద్ద పరీక్షల్లోనే కాకుండా చిన్న చిన్న పరీక్షలు అంటే టైపురైటింగ్, హిందీ పరీక్షలు యందు కూడా పాసు కావడానికి ఆమె కటిక ఉపవాసాలు వుండి, సహస్రనామాలు చేసేది....ఆ కొడుకు పెద్ద వాడైనాడు....ఉద్యోగం కోసం, పెళ్లి కోసం మండలం రోజులు ఉపవాసాలు వుండి, నేల మీద పడుకొని తిండి మాడ్చుకొని, జడ కూడా వేసుకోకుండా పూజలు, వ్రతాలు చేసేది....

ఆమె కొడుకు కు పెళ్లి అయినది, ఉద్యోగం వచ్చినది....ఇక అవతల వాళ్ల పిల్లలకోసం ఉపవాసాలు..

ఆ పిల్లలు పాసు కావడానికి, వాళ్లకు ఇంజినీరింగ్ లో సీటు రావడానికి మరలా ఉపవాసాలు...

ఆ తరవాత వాళ్ల పెళ్లిలకు కూడా ఉపవాసాలు చేసింది ఆ పిచ్చి నాయనమ్మ....85 ఎండ్లు బ్రతికినది.....

ఆ కొడుకు ఒక్కనాడు కూడా అమ్మను అమ్మా అని పిలువలేదు....ఓక్కనాడు కూడా దగ్గర కూర్చోని అమ్మ దగ్గర మంచి చెడ్డా మాట్లాడినది లేదు.... ఆ మనువళ్లు కూడా ఓక్క నాడు ఆమెను నాయనమ్మా అని పిలిచినది లేదు.....పైగా ఆమెను దుపో....అని పిలిచేవారు, అమ్మా నాన్నలు వారించలేదు, తప్పు అని అరవలేదు...ఆమె కొద్దిగా లావుగా వుంటుంది అందుకని వాళ్లు ఆమెను దున్నపోతూ అని పిలిచేవారు.....పాపం ఆవిడ నవ్వుతూ వుండేది....పెద్దలకు లేని సంస్కారం పిల్లలకు ఎలా వస్తుంది....బ్రతికనన్నాళ్లూ కొడుకు ఎక్కడ కష్టపడతాడో అనే దిగులు ఆమెకు....

ఆఖరాకి మంచాన పడితే కొడుకు ఎక్కడ కష్టపడతాడో అని, కొడుక్కు శెలవు ఇవ్వరే అని కొడుకు కోసం ఆమె భగవంతుడ్ని రోజూ ప్రార్ధించేది....

భగవంతుడా! నా కొడుకు కు ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకొనిపో అని.....

భగవంతుడు ఆమె మొర ఆలకించినాడు, ఓకరోజు ఉదయం బాత్రూమ్ కి వెళ్లి అక్కడ పడిపోయింది, తుది శ్వాస విడిచింది....

అయినా ఆ కొడుకు కు కనువిప్పు జరగలేదు....పైగా తన తల్లిదండ్రులు బాగా ఆస్తి సంపాదించి ఇవ్వలేదు, అందరిలాగ ఉన్నతంగా బ్రతకడానికి వీలులేకుండా పోయింది అని పటం ఎక్కిన తల్లిదండ్రులను తిట్టిపోసేవాడు.....తద్దినాలు పెట్టకపోతే దయ్యం అయ్యి పట్టుకొంటారేమో అనే భయంతో తద్దినాలు పెట్టే వాడు....

ఇప్పుడు అతనికి 58 ఎండ్లు....సంవత్సరం క్రిందట ఓక వింత జబ్బు వచ్చింది ...కాళ్లు చచ్చుపడిపోయినాయి....వెన్నెముక క్రింద బాగం నుంచి పనిచేయదు....మంచంలో పడిపోయాడు ...అంతా మంచంలోనే....అల్లాడుతున్నాడు.....అయినా పశ్చాత్తాపంతో కుమిలిపోయినాడా అంటే లేదు.....ఇప్పుడైనా నోరారా అమ్మా అని పిలుస్తాడా అంటే పిలువడు.....ఏ లోకాలలో వున్నదో ఆ తల్లి ఎంతగా అల్లాడుతున్నదో కొడుకు పిలుపు కోసం సాయం చెద్దామని.....

ఇది నిజం కల్పించి వ్రాసినది కాదు....ఇది జరిగిన విషయం...యధార్థం గా ఇప్పుడు జరిగిన విషయం.

చూడండి ఇలాంటి కొడుకులు నేటికీ వున్నారు....వాళ్లు తప్పు చేసినారు....వాళ్లను చూసి వాళ్ల పిల్లలూ తప్పు చేసినారు....ఎక్కడ నుంచి వస్తుంది సంస్కారం?

ఆలోచించండి.....ఇదేనా మనం మన పిల్లలకు నేర్పించేది?

అమ్మను కూడా ఓసేయ్ అని పిలుస్తారు కొందరు పిల్లలు....తండ్రిని గొంతు పిసకపోయే కొడుకులు...అత్తను చావగొట్టే కోడళ్లు...ఇదేనా మన సంస్కృతి?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!