రావోయి బంగారు మామా! (శ్రీ కొనకళ్ల వెంకటరత్నం.)

రావోయి బంగారు మామా!

(శ్రీ కొనకళ్ల వెంకటరత్నం.)

రావోయి బంగారిమామా

నీతోటి

రహస్య మొకటున్నదోయీ

పంటకాలువ ప్రక్క

జంటగా నిలుచుంటె

నీడల్లో మన యీడు

జోడు తెలిశొస్తాది-

రావోయి...

ఈ వెన్నెల సొలపు

ఈ తెమ్మెరల వలపు

రాత్రి మన సుఖకేళి

రంగరించాలోయి-

రావోయి...

నీళ్లతూరల వెన్క

నిలుచున్న పాటనే

జలజలల్‌ విని, గుండె

ఝల్లుమంటున్నాది-

రావోయి...

ఈనాటి మన వూసు

లేనాటికీ, మనకు,

ఎంత దూరానున్న,

వంతెనల్‌ కట్టాలి-

రావోయి...

అవిసె పువ్వులు రెండు

అందకున్నయి నాకు;

తుంచి నా సిగలోన

తురిమి పోదువుగాని-

రావోయి...

ఏటి పడవసరంగు

పాట గిరికీలలో

చెలికాడ మనసొదల్‌

కలబోసుకుందాము-

రావోయి...

జొన్నచేలో, గుబురు

జొంపాలలోగూడ,

సిగ్గేటో మనసులో

చెదరగొడుతున్నాది-

రావోయి...

.ఈ పాటకు నేను చేసిన వీడియో

https://www.youtube.com/watch?v=Cz3af36H23g

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!