విరిసినది వసంత గానం వలపుల పల్లవిగా...

విరిసినది వసంత గానం వలపుల పల్లవిగా...

(నెట్ నుండి)

విరిసినది వసంత గానం వలపుల పల్లవిగా

మనసే మందారమై వయసే మకరందమై

అదేదో మాయ చేసినది

ఝుమ్మంది నాదం రతివేదం

జత కోరే భ్రమల రాగం

రమ్మంది మోహం ఒక దాహం

మరులూరే భ్రమల మైకం

పరువాల వాహినీ ప్రవించే ఈ వని

ప్రభవించె ఆమని పులకించె కామిని

వసంతుడే చెలి కాంతుడై దరిచేరె మెల్లగా..

ఋతువు మహిమేమో విరితేనె

జడి వానై కురిసే తీయగా

లతలు పెనవేయ మైమరచి

మురిసేను తరువు హాయిగా

రాచిలక పాడగా రాయంచ ఆడగా

రసలీల తోడుగా తనువెల్ల ఊగగా

మారుడే సుకుమారుడై జతకూడె మాయగా

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!