‘ముత్యాల ముగ్గు,’.!

‘ముత్యాల ముగ్గు,’.!

.

ముత్యాల ముగ్గు, సినిమాకి సుధర్శన్ థియేటర్ కి వెళ్ళినప్పుడు థియేటర్ బయట మొత్తం ముగ్గులతో నింపేసారని గుర్తుంది.

.

ఆ సినిమా చిన్నప్పుడు చూస్తే ఆ పిల్లలు, కోతి, హనుమంతుడు చాలా నచ్చాయి. 

.

కాస్త పెద్దయ్యాక చూస్తే, శ్రీధర్, సంగీతని మొదటిసారి చూసినప్పుడు ‘అబ్బా, ఎంత పెద్ద కళ్ళో,’ అనడం, సంగీత రెప్పలార్చి చూడడం,

హీరోయినుకి ఎక్కువ మేకప్ లేకుండా చూపించడం బాపు గారికి చెల్లితే, 

ఆ పాత్రని అచ్చ తెలుగు అమ్మాయిలా తీర్చి దిద్దడం శ్రీ వెంకటరమణ గారు చేసిన పని. 

.

రావు గోపాల రావు గారి డైలాగులు ఎవరైనా మర్చిపోగలరా? 

ముత్యాల ముగ్గు సినిమా తరవాత ముగ్గులపైన ఇష్టం పెరగడం, అబ్బాయిలు, 

తాము పెళ్ళి చేసుకునే అమ్మాయిలు సంగీతలా కళ్ళకు కాటుక పెట్టుకుని, చేతినిండా గాజులేసుకుని, కాళ్ళకు వెండి గజ్జెలు పెట్టుకుని, వాలు జడ వేసుకుని, లంగా ఓణీయో, చక్కగా చీర కట్టుకునో వుండాలని కోరుకునే వారంటే ఆ ప్రభావం ఎవరిదంటారు?

బాపు రమణల గొప్పదనం కాకపోతే! 

.

రామాయణ కథని అందరికీ అర్ధం అయ్యేలా ఈనాటి పరిస్థితులకి తగ్గట్టుగా తీసి చూపించారు ముత్యాలముగ్గు కథతో.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!