పోతనామాత్యు ని శార్దూలం!

పోతనామాత్యు ని శార్దూలం!

-శా.

"అమ్మా! మన్నుదినంగ నే శిశువునో? యాఁకొంటినో? వెఱ్ఱినో? 

నమ్మం జూడకు వీరి మాటలు మదిన్; న న్నీవు గొట్టంగ వీ

రి మ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీయాస్య గం

ధ మ్మాఘ్రాణము జేసి నా వచనముల్ దప్పైన దండింపవే."

.

భావము:

" అమ్మా! మట్టి తినడానికి నేనేమైనా చంటిపిల్లాడినా చెప్పు. 

ఇప్పుడే కదా పాలు తాగాను ఇంకా ఆకలి ఎందుకు వేస్తుంది. లేకపోతే నేనేమైనా అంత వెర్రివాడినా ఏమిటి మట్టి తినడానికి. 

నువ్వు నన్ను కొట్టాలని వీళ్ళు కల్పించి చెప్తున్నారు అంతే. కావాలంటే 

నా నోరు వాసన చూడు. నే చెప్పింది అబద్ధమైతే కొట్టుదుగానిలే. 

వీళ్ళు చెప్పేమాటలు నమ్మెయ్యద్దు" అని చిన్నికృష్ణుడు,

మట్టి ఎందుకు తింటున్నావని బెదిరిస్తున్న తల్లి యశోదమ్మకి చెప్పి నోరు తెరిచి చూపించాడు.

Comments

  1. సంస్కృత మూలం:
    నాహం భక్షితవాన్ అంబ
    సర్వే మిథ్యాభిశంసినః
    యది సత్య గిరస్తర్హి
    సమక్షం పశ్యమె ముఖం

    ReplyDelete
  2. సినారె గారు ఈ పద్యాన్ని గురించి చక్కగా వివరించారు... పోతన మకరందాలో..మందారమకరందాలో అనుకుంటా..

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!