పొడుపు కథలు!

పొడుపు కథలు!

కాటుక రంగు, కమలం హంగు, విప్పిన పొంగు, ముడిచిన కుంగు.

ఏమిటది?(జవాబు : గొడుగు)

,

రెక్కలు లేవు కానీ ఎగురుతుంది.

కాళ్లు లేవు కానీ ముందుకు వెళ్తుంది.

చివరకు మాయమవుతుంది.

ఏమిటది?(జవాబు : మేఘం)

.

కదలకుండానే నదిని దాటగలదు?

ఏమిటది?(జవాబు : వంతెన)

.

ముందుకూ వెనక్కూ తప్ప పక్కలకు కదలదు.

ఏమిటది?(జవాబు : తలుపు)

.

గుడ్డ కింద దాగున్న దొంగకు నాలుగు కాళ్లు.

ఎవరది?(జవాబు : టేబుల్)

.

చెట్టంతా చేదుమయం,

రోగాలకు దివ్య ఔషదం,

పుల్ల చేయు దంతదావనం.

ఏమిటది?(జవాబు : వేపచెట్టు)

.

నల్ల కుక్కకు నాలుగు చెవులు?

ఏమిటది?(జవాబు : లవంగం)

.

పొట్టలో వేలు, నెత్తి మీద రాయి?ఏమిటది?(జవాబు : ఉంగరం)

.

సన్నని స్తంభం,

ఎక్కలేరు, దిగలేరు?ఏమిటది?(జవాబు : సూది)

.

ఆకాశంలో కెగిరినా పక్షి కాదు,

తోక కలిగిఉన్నా మేక కాదు,

తాడు ఉన్నా ఎద్దు కాదు,

ఏమిటది?(జవాబు : గాలిపటం)

.

వేసే వేసే జీలకర్రా,

మొలిచే మొలిచే మూలకా కూర,

పూసే పూసే బొండు మల్లే,

వేసే వేసే వింత గెలరా,

కాసే కాసే కామంచీ. ఏమిటది?(జవాబు : అరటి)

.

నల్లని చేనులో తెల్లటి దారి?

ఏమిటది?(జవాబు : తల్లో పాపిడి)

.

దూడ అక్కడనే ఉండు,

ఆవు పోతావుండు?

ఏమిటది?(జవాబు : గుమ్మడికాయ తీగ )

.

జవ్వాది రాయంగా,

పునుగు పూయింగా,

మందగిరి పర్వతాలలో నీరు తాగి,

మశాలకు వేసుకొని పడుకుంది. ఏమిటది?((జవాబు : దివిటి)

.

రెక్కలు గల మా చక్కని భామలు,

నిక్కముగా అసలెగురలేదు,

నీరంటే అడ్డమే లేదు. ఏమిటది?(జవాబు : పడవ)

.

అగ్గి అగ్గీ ఛాయ,

అమ్మ కుంకుమ ఛాయ,

బొగ్గు బొగ్గు ఛాయ,

పోలి ఛాయ కంది పప్పు ఛాయ,

కాలనేమి ఛాయ,

కడసారి తాతయ్య కణతి ఛాయ. ఏమిటది?(జవాబు : గురిగింజ)

.

అమ్మ కడుపున పడ్డాను,

అంతా సుఖాన ఉన్నాను,

నీచే దెబ్బలు తిన్నాను,

నిలువునా ఎండి పోయాను,

నిప్పుల గుండు తొక్కాను,

గుప్పెడు బూడిద అయినాను. ఏమిటది?(జవాబు : పిడక)

.

అడవిలో పుట్టింది,

అడవిలో పెరిగింది,

మాఇంటికొచ్చింది,

మహాలక్ష్మి లాగుంది. ఏమిటది? (జవాబు : గడప)

.

అడవిలో పుట్టింది,

అడవిలో పెరిగింది,

మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది. ఏమిటది? (జవాబు : చల్ల కవ్వం)

.

అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు,

కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు,

అన్ని పువ్వుల్లో రెండే కాయలు. ఏమిటవి?(జవాబు : ఆకాశం, చుక్కలు, సూర్యుడు) 

.

బుర్రు బుర్రు మనచును ....

రోడ్డు పైన నడచును....... ఏమిటది? (జవాబు : స్కూటర్)

.

కుర్రు కుర్రు మనచును .........

చెట్టుపైకి ఎగురును .......... ఏమిటది? ( జవాబు : కోతి)

.

తుర్రు తుర్రు మనచును ......

అంబరానికెగురును....... ఏమిటది? (జవాబు : పక్షి)

.

అంబ అంబా అని అరుచును

తల్లి వెంట తిరుగును .....ఏమిటది ?(జవాబు : తువ్వాయి (ఆవుదూడ))

.

మీట నొక్కినంతనే .........

టక్కుమని వెలుగును ...... ఏమిటది? (జవాబు : బల్బు)

.

చుట్ల చుట్ల గోడ మీద నూరు నిమ్మపండ్లు పుట్టె,

రాజులంత తలవంచిరి. ఏమిటది? (జవాబు : మొక్కజొన్నకంకి)

.

ఒక చెట్టు,

చెట్టుకు నాలుగు కొమ్మలు,

కొమ్మకు రెండు కాయలు. ఏమిటవి? ( జవాబు : సూర్యుడు, చంద్రుడు)

.

కావాలంటే పెద్ద చేసి చూపిస్తా

సూర్యున్ని చిన్నగా చేస్తా

మంటలు మండిస్తా. ఏమిటది? (జవాబు : భూతద్దం)

.

పన్నెండాకుల చక్రం పదే పదే తిరుగుతుంది.

తిరిగి తిరిగి ఆ రోజున అక్కడికే తిరుగొస్తుంది. ఏమిటది?(జవాబు : సంవత్సరాది)

.

వెలుతురులో నీతోటే ఉంటుంది.

చీకటిలో తప్పించుకు పోతుంది. ఏమిటది? (జవాబు : నీడ)

.

నారూ నీరూ అక్కరలేదు

ఎంత కత్తిరిస్తున్నా ఎదుగుతునే ఉంటుంది. (జవాబు : జుట్టు)

.

ఇంటింటికి ప్రవహిస్తూ వస్తుంది,

పనులెన్నో చేస్తుంది,

ప్రమోదకారి, ప్రమాదకారి. ఎవరది? (జవాబు : విద్యుత్)

.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!