మీ కో పిట్ట కథ !

మీ కో పిట్ట కథ !

,

ఒక నిర్భాగ్యుడెవడో కొండ మీద నుండి కాలు జారో,

ఎవరో తోసేస్తేనో…పడిపోతున్నాడు…దొర్లుతూ…గిర గిరా తిరుగుతూ…. 

అప్పుడు రంగ నాయకమ్మ లాంటి వాళ్ళను ‘ విషయం కాస్తా చూడండి ‘ అని ఎవరో…ప్రభుత్వాధికారి అనే అనుకో…. పంపాడు .

ఆమె హుటా హుటిన అక్కడికి చేరింది. కొండ మీద నుండి జారి పడే మనిషిని చూసింది…తీక్షణంగా గమనించింది.

.సెకన్ లలో సమస్యను సూక్ష్మంగా ఆకళింపు చేసుకుంది….ఆమె చాలా షార్ప్ కదా మరి…. వెంటనే అప్పటికప్పుడు ఒక మెయిల్ పంపింది…… ”

అసలు ఈ కొండ ఇక్కడ భూ అంతర్భాగం లో జరిగిన మార్పుల వల్ల ఏర్పడి, ప్రమాదాలకు తావుగా నిలుస్తుంది. భూ అంతర్భాగం లో జరిగే మార్పులను పసిగట్టి మనం అరికడితేనే ఈ సమస్యకు మూలం దొరుకుతుంది. 

ఐతే ‘ కొండ ఎత్తుగా ఉంటుంది…కాలు పెట్టడంలో జాగర్తగా ఉండాలి’ అని తెలుసుకోలేని అవివేకత్వం ఈ సమాజం లో ఉన్నంత కాలం ఈ ప్రమాదాలు తప్పవు.

ఇప్పుడు ఇక్కడ కింద పడిపోతున్న వ్యక్తి నిజానికి ఎన్నో రాళ్ళను , గడ్డి పీచులను ఆసరా తీసుకోవడం లో కనీస తెలివి కూడా చూపించ లేకపోవడం అన్నది మనమెవ్వరూ గమనించట్లేదు. 

నిజానికి మనం అవసరం ఏమీ లేకుండానే ఇతడు రక్షించుకునే పరిస్థితిని కూడా విస్మరించాడు. దీనికి ప్రధాన మూలం ఎక్కడుందంటే అతని బుర్ర లోనే ఉంది.

అది పగిలే దాక ఆయన్ని రక్షించడం వృథా !

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!