సఖీ ! యా రమితా వనమాలినా


బాల మురళి గారి అమృత గానం. !

( జయదేవుని ...అష్టపది. .)

.

సఖీ ! యా రమితా వనమాలినా 

వికసిత సరసిజ లలితముఖేన స్ఫుటతీ న సా మనసిజ

విశిఖేన అమృత మధుర మృదుతర వచనేన జ్వలతి న

సా మలయజ పవనేన స్థల జలరుహ రుచికర చరణేన లు

సా హిమకర కిరణేన శజల జలద సముదయ రుచిరేణ దళతి న సా హృది విరహభరేన కనక నిష రుచి శుచి వసనేన శ్వసితి న సా పరిజన హసనేన సకల భువనజన వర తరుణేన వహతి న సా రుజ మతి కరుణేన శ్రీ జయదేవ భణిత వచనేన ప్రవిశతు హరి రపి హృదయ మనేన .

.

అర్ధం... . 

సఖీ, గాలికి కదలాడే పద్మాల వంటి కన్నులు గల వనమాలి తో రమించిన స్త్రీ 

చిగురాకుల శయ్య మీద పరితపించదు. కోమలమైన పద్మము వంటి ముఖము గల

వనమాలి తో రమించిన స్త్రీ మన్మధుని బాణాలకు ఛిద్రం కాదు

. తియ్యనైన అమృత వచనములు చేసే వనమాలి తో రమించిన స్త్రీ

శీతలములైన గాలులకు తాపము చెందదు. 

\తామర తూడులవంటి కర చరణాల వనమాలితో రమించిన స్త్రీ 

చంద్రుని కిరణాలకు విలవిలలాడదు. 

కారుమబ్బుల వంటి వనమాలి తో సుఖము పొందిన యువతి 

యొక్క హృదయం విరహ బాధను చెందదు. 

శుభ్రమైన పీతాంబరములు ధరించిన వనమాలితో రమించిన స్త్రీ 

పరిజనుల వికటములకు నిట్టూరుపు చెందదు. 

అన్ని భువనములలోని జనులలో ఉత్తమ యువకుడైన వనమాలితో 

రమించిన వనిత కరుణార్ధ్రమైన విరహాన్ని కలుగదు. 

శ్రీ జయదేవ కవి వచనముల ద్వారా హరి మన హృదయాలలో ప్రవేశించు.


x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!