ఆ బ్రహ్మ రహస్యం...పోతన - శ్రీమద్భాగవతం !

ఆ బ్రహ్మ రహస్యం...పోతన - శ్రీమద్భాగవతం !

"ఈ జలమందునీ కమలమేగతి నుద్భవమయ్యె, నొంటి నే

నీ జలజాతపీఠమున నేగతినుంటి, మదాఖ్య యెద్ది నా

కీ జననంబు నొందుటకు నెయ్యది హేతువు బుద్ధి జూడ నే

యోజ నెఱుంగలేనని పయోరుహగర్భుడు విస్మితాత్ముడై"

.

పదవిభాగం: ఈ జలము + అందున్, ఈ, కమలము, ఏ, గతిన్, ఉద్భవము, అయ్యెను, ఒంటిన్, నేను, ఈ జలజాత, పీఠమునన్, ఏగతిన్, ఉంటి, మత్, ఆఖ్య, ఎద్ది, నాకు, ఈ జననంబున్, పొందుటకున్, ఏ + అది, హేతువు, బుద్ధి, చూడన్, ఏ, యోజన్, ఎఱుంగలేనని, పయోరుహ, గర్భుడు, విస్మిత, ఆత్ముడై.

భావం: 

శ్రీమహావిష్ణువు తన నాభిభాగం నుంచి కమలాన్ని సృష్టించి, 

అందులో తన అంశను నిలిపి, బ్రహ్మదేవుడిని సృష్టించాడు.

అప్పుడు ఆ బ్రహ్మదేవుడు...

ఆహా! ఏమిటీ అద్భుతం! అంతా నీటితో నిండి ఉంది. 

ఈ జలరాశిలో ఈ కమలం ఏ విధంగా పుట్టింది? 

నేను ఒక్కడినే ఈ నీటి మీద ఎలా ఉన్నాను?

నా పేరేమిటి? 

నేను ఈ విధంగా పుట్టడానికి కారణం ఏమిటి? 

ఎంత ఆలోచించినా ఈ రహస్యం ఏమిటో నాకు తెలియట్లేదు... 

అని ఆశ్చర్యపోయాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!