మాళవికాగ్నిమిత్రము.!

మాళవికాగ్నిమిత్రము.!

.

మాళవికాగ్నిమిత్రము మహాకవి కాళిదాసు విరచిత సంస్కృత నాటకము.

ఇది కాళిదాసు యొక్క మొట్టమొదటి నాటక రచన. ఈ నాటకములోని ప్రధాన పాత్రలు మాళవిక మరియు అగ్నిమిత్రుడు.

.

ఈ నాటకం నాంది ప్రస్తావనలోనే, సూత్రధారుని చేత, కాళిదాసు చక్కటి విషయాన్ని , ఈ నాటికి కూడ అన్వయించుకోగలిగిన ,మాట చెప్పించాడు.

అదేమిటంటే, పాతది అయినంత మాత్రాన, ఆవిషయం గొప్పది అనుకోవటానికి లేదు, అలాగే, కొత్తది అయినంతమాత్రాన, ఆ విషయం చెడ్డది అనుకోనక్కర్లేదు అని. 

కాబట్టి, ఏ విషయంలోనైనా ఉన్న పస బట్టి గొప్పదనం, సామాన్యంగా లోకంలో ప్రాచుర్యం సంపాదిస్తాయి కాని, ఆ విషయం యొక్క కాలాన్ని బట్టి కాదని

కాళిదాసు చక్కగా వివరించాడు

.

ఈ నాటకము ప్రధానముగా విదిశా నగరాధిపతి, శుంగ వంశపు రాజయిన అగ్నిమిత్రుడు మరియు అతని రాణి యొక్క ప్రధాన (దాసి) చెలికత్తె అయిన మాళవికల ప్రేమను అంశముగా తీసుకొని రచింపబడినది

. అగ్నిమిత్రుడు, బహిష్కృతురాలయిన ఒక దాసి అగు మాళవిక యొక్క ఛాయాచిత్రమును చూసి ఆమెను ప్రేమిస్తాడు.

ఈ విషయమును తెలుసుకొన్న రాణి, మాళవికను కారాగృహమున బంధించును. కానీ, విధివిలాసముచే దాసిగా పనిచేయుచున్న మాళవిక నిజానికి 

ఓ రాకుమార్తె అన్న విషయము బయటపడి, అగ్నిమిత్రునితో ఆమెకు గల ప్రేమ సంబంధమునకు గల అడ్డంకులన్నీ తొలగిపోవును.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!