'బృహత్కథ'.!

'బృహత్కథ'.!

.

పూర్వం దీపకర్ణి అనే రాజు వుండేవాడు.

అతనికి చాలాకాలము సంతానము కలగలేదు. ఎన్నో పూజలూ,వ్రతాలూ, యాగాలూ చేసిన తర్వాత ఆయనకు కలలో ఒక ఆదేశం వినపడింది. 

రాజా! నీవు అడవి లోకి ఒక్కడివే వెళ్ళు. అక్కడ పులిమీద ఒక మూడేళ్ళ బాలుడు కనిపిస్తాడు.అతడిని తెచ్చి నీ కుమారుడిగా పెంచుకో అని. 

.

దీపకర్ణి అడవికి వెళ్లి పులిమీద కూర్చున్న బాలుడిని తీసుకొని వచ్చి తన కుమారుడిగా ప్రకటించి అతనికి శాతవాహనుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు.మంచి గురువుల వద్ద విద్య,రాజులకు అవసర మైన యుద్ధవిద్య నేర్పించాడు..అతనికి యుక్త వయసు రాగానే ఒక అందమైన రాజ కన్యక తో వివాహం జరిపించి అతనికి పట్టాభిషేకం చేసి తాను భార్యతో సహా వానప్రస్థానానికి వెళ్లి పోయాడు. 

.

శాతవాహనుడు ప్రజానురంజకంగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు.

అతని భార్య సంస్కృత పండితురాలు.రాజుకు అంత సంస్కృత పరిజ్ఞానం లేదు

.ఒక రోజు శాతవాహనుడు రాణి తో బాటు వనవిహారానికి వెళ్లి అక్కడి చెరువులో యీత కొట్టడానికి దిగారు.కాసేపు నీటిలో విహరించిన తర్వాత .రాజు చిలిపిగా అదే పనిగా రాణి ముఖం మీద నీళ్ళు చల్లసాగాడు . 

ఆమె తన ముఖానికి చెయ్యి అడ్డం పెట్టుకుంటూ "రాజన్ మోదకైస్తా డయా" "రాజన్ మోద కైస్తా డయా" అని అనింది.

అంటే రాజా నీళ్ళతో కొట్టవద్దు అని అర్థం (మ ఉదకై: తాడయా)

కానీ సంస్కృత పరిజ్ఞానం అంతగా లేని రాజు మోదకములతో(లడ్డూలతో)

కోట్టమంటూ వుందని ఒడ్డున వున్న పరిచారికలతో లడ్డూలు తెప్పించాడు.

అది చూసి రాణి రాజా నేను నీళ్ళతో నన్ను కొట్టవద్దు అని అన్నాను.లడ్డూలతో కొట్టమని కాదు. మీకు అంత మాత్రం అర్థం కాలేదా?అని పక పక మని నవ్వింది..

.

రాజు అహానికి పెద్ద దెబ్బ తగిలింది.ఆమె ఎగతాళికి. మరుదినం తన ఆస్థానం లో వున్న పండితు లందరినీ సమావేశ పరిచాడు

.పండితులారా మీలో యెవరైనానాకు అతి త్వరలో సంస్కృతం నేర్పించగలరా 

అని అడిగాడు.గుణాడ్యుడు అనే పండితుడు లేచి రాజా సంస్కృతం నేర్పించ దానికి ఒక సంవత్సరము అంతకు పైననే పడుతుంది.అన్నాడు.

రాజు లేదు నాకు ఒక ఆరునెలల లోపలే నేర్పించాలి అన్నాడు. 

అది అసంభవం మహారాజా! అన్నాడు గుణాడ్యుడు. .

ఆస్థానము లోని యింకొక .పండితుడు శర్వవర్మ లేచి మహారాజా!నేను నేర్పించ గలను.మీకు కొంత పరిజ్ఞానము వుంది కనుక అదేమీ కష్టమైన పని కాదు.అన్నాడు. గుణాడ్యుడు మాత్రం అది సంభవం కాదు అని వాదించాడు.

యిద్దరు పండితులూ వాదించుకున్నారు.ఆఖరుకు గుణాడ్యుడు 

సరే అయితే నీవు ఆరు నెలల లోపల రాజుకు సంస్కృతం నేర్పించ గలిగితే నేను సంస్కృతం లోమాట్లాడడము, కావ్యాలు రాయడం అన్నీ మానేసి అడవికి వెళ్లి జీవిస్తాను . అని ప్రతిజ్ఞ చేశాడు.

అలాగే అన్నాడు శర్వ వర్మ.నేను కూడా ఓడిపోతే ఈ రాజ్యము విడిచి వెళ్ళిపోయి యింక సంస్కృతం లో కావ్యాలు వ్రాయడం మానేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. 

శర్వవర్మ ఇంటికి వెళ్లి యోచన చేశాడు.అతనేదో గుణాడ్యుడి పైన అసూయతో ఆరు నెలల లో నేర్పిస్తానని అన్నాడే కానీ అది సాధ్యము కాదని అతనికీ తెలుసు.

దిగులుతో కూర్చొని వున్న అతన్ని చూసి అతని భార్య సంగతి తెలుసు కొని మీరు దేవీ ఉపాసకులు కదా! ఆ దేవిని ఉపాసన చేసి మీకు ఆ శక్తి నిమ్మని ప్రార్థించండి

అని సలహా యిచ్చింది. దానికి సరే నని శర్వవర్మ రాత్రంతా నిష్ఠగా దేవిని ఉపాసించి ప్రసన్నం చేసుకొన్నాడు దేవి అతనికి త్వరగా సంస్కృతం నేర్పించే శక్తిని అనుగ్రహించింది.

మంచిరోజు చూసుకొని రాజుకు సంస్కృతం నేర్పించడం ప్రారంభించాడు శర్వవర్మ.దేవి అనుగ్రహం వల్ల రాజుకు ఆరు నెలల లోపల సంస్కృతం క్షు ణ్ణమ్ గా నేర్పించాడు. ప్రతిజ్ఞ ప్రకారం గుణాడ్యుడు అడవి కి వెళ్ళిపోయాడు.

.

సంస్కృతం లో కావ్యాలు వ్రాయడం,మాట్లాడడం మానేశాడు.అడవిలో తిరుగుతూ పిశాచాలతో స్నేహం చేసి వాటి భాష నేర్చుకున్నాడు. 

తర్వాత అతను "బృహత్కథ"అనే గ్రంథాన్ని పిశాచ భాషలో కొన్ని లక్షల శ్లోకాలతో 

వ్రాశాడు.

ఆ గ్రంథాన్ని తీసుకొని శాతవాహనుడి సభకు వెళ్లి చదివి వినిపించాడు..

ఆ భాష ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎవ్వరికీ అర్థం కాని గ్రంథం దేనికి పనికి వస్తుంది? అని రాజు యెగతాళి చేశాడు.

గుణాడ్యుడు చాలా బాధపడి ఎవరికే పనికి రాని గ్రంథ మెందుకు అని కట్టెలతో మంట చేసి ఒక్కో శ్లోకం చదువుతూ ఒక్కొక్క పుటను చింపి అగ్ని లో వేయ సాగాడు.

అడవిలోని జంతువులన్నీ ఆ మంట చుట్టూ చేరినిద్రాహారాలు మాని ఆ శ్లోకాలు వింటూ కన్నీరు కారుస్తున్నాయి.జంతువులన్నీ చిక్కి సగ మయ్యాయి.

శాత వాహనుడి నగరం లో మాంసా హారమే కరువైంది.రాజుకు కూడా సరియైన మాంసాహారము లేక పిచ్చి పట్టి పోయింది.ఎందుకని అడిగితే సేవకులు గుణా డ్యుడు చేస్తున్న పని గురించి,జంతువులు అక్కడే చుట్టూ మూగి కన్నీరు కారుస్తూ చిక్కి పోయిన సంగతీ చెప్పారు.

అప్పుడు శాతవాహనుడికి జంతువులను కూడా ఆకర్షించిన 'బృహత్కథ' యెంత ఉత్తమమైనదో అర్థ మైంది.

ఆయన,శర్వవర్మ యిద్దరూ కలిసి అడవికి వెళ్లి గుణాడ్యుడిని క్షమించమని వేడుకొని ఆ గ్రంథాన్ని మంటల్లో వేయకుండా ఆపించారు..గుణాడ్యు డిని రాజ్య్యానికి తీసుకొని వచ్చి మహానుభావా!

మీ ప్రతిజ్ఞ ను వెనక్కి తీసుకొని ఆ గ్రంథాన్ని సంస్కృతం లోకి అనువదించండి అని ప్రార్థించారు..శర్వవర్మకూడా నేను కూడా నా మాటను వెనక్కు తీసుకుంటున్నాను దయచేసి ఆ గ్రంథాన్ని సంస్కృతం లో అనువదించండి.అని ప్రార్థించాడు . 

.లేకుంటే అంత మంచి గ్రంథం వృథా అయి పోతుందని భవిష్యత్తరాల ప్రజలకోసం తప్పక అనువాదం చేయాలని చెప్పి వోప్పించాడు .

అప్పుడు గుణా డ్యుడు ఆ కావ్యాన్ని సంస్కృతం లోకి అనువదించాడు. .

అగ్నికి ఆహుతి కాగా మిగిలిన దే యిప్పుడు మనకు లభించిన 'బృహత్కథ'.

ఈ కథ మాకు ఎస్.ఎస్.ఎల్.సి లో ఉపవాచకము(సంగ్రహ కథ) లో వుండినది.. . . (non --detailed text book)

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!