అమ్మ చిక్కిపోతోంది!

అమ్మ చిక్కిపోతోంది!

.

"ఏడవకమ్మా, తెలుగుభాషంటే ప్రాణంగా ప్రేమించే నేను నీవు దుఃఖిస్తుంటే చూస్తూ ఊరుకుంటానా, అసలు నీ దు:ఖ కారణం వివరంగా చెప్పుతల్లీ!" అంటే ఇలా చెప్పుకొచ్చింది...

"ఇప్పటివరకూ మింగిన అక్షరాలతోపాటూ 'ళ' ని కూడా ఈ మధ్య మింగేసేరు, కళ్ళు అనడానికి కల్లు అంటునారు. కల్లు అంటే నీకు తెలుసుగా, తాటికల్లో ఈతకల్లో అవదా??, ఇంకొంచెం లోతుకు వెళితే కల్లు అంటే రాయి కూడా అవుతుందికదా ( ఉప్పు కల్లు, సన్నికల్లు) మరి వీళ్ళు కళ్ళని కల్లు అంటే బాధపడనటయ్యా?

పెళ్ళిని పెల్లి అంటునారు, కళని కల అంటునారు, వాళ్ళని వాల్లు అంటునారు. టీవీ లంగరులూ, సినిమాల్లో డబ్బింగుచెప్పేవారూ, వార్తలు చదివేవారు ఇక వారూ వీరూ ఏమిటయ్యా అందరూ ఇదే వరస".

తీరా ఆవిడ చెప్పేక అనిపించింది అడిగి పొరబాటు చేసేనా అని ఎందుకంటే పెల్లికాదర్రా పెళ్ళి అనాలి అని ఈ మధ్య ఎవరితోనో అంటే, నేనలా పక్కకి వెళ్ళగానే అతనో చాదస్తం మనిషిలెండి అనుకోవడం నా చెవిని పడింది

పోతనగారైతే కాటుక కంటినీరు అని గబగబా ఒక పద్యం అందుకుంటారు.నేను అంతటివాణ్ణి కాను కదా అందుకని అయ్యో ఎంత చిక్కిపోతోందో ఆంధ్రమాత అని వలవల్లాడేను. -

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.