సందేహం..సమాధనం.!

సందేహం..సమాధనం.!

Bhaskarananda Natha · గారి ప్రశ్న .

.

శ్రీరాముడు తాను పితృవాక్య పరిపాలన చేశాడు....మరి ఇంద్రజిత్ అదే ధర్మమును పరిపాలించినాడు....మరి ఆయన్ను ఒప్పు, ఈయన్ను తప్పు అని ఎందుకు అన్నారు? ఎందుకు చరిత్ర ఇంద్రజిత్ ను గుర్తించలేదు?

Ambica Bhavarajuగారి సమాధనం.

.

పితృ వాక్య పరిపాలన ధర్మం అయి ఉండవచ్చు గాక కానీ పరమ ధర్మం

ఈ సందర్భం లో కానేరదు .ఎందుకంటే తండ్రి అధర్మ వర్తను డు అయినప్పుడు అతన్ని అనుసరించడం ,suport చెయ్యడం పాపమే అవుతుంది .

ధర్మ లోపం జరిగినప్పుడు దాన్ని ఖండించడం కూడా గొప్ప ధర్మం .

అవునునిజమే..

Bhaskarananda Natha గారు

రాముడే ఇంద్రజిత్ స్థానంలో వుండి వుంటే తండ్రి మాట వినడు, వద్దు నాన్నగారు....సీతను చెరపట్టడం ధర్మం కాదు, వదిలి పెట్టండి, మీ తరఫున నేను యుద్ధం చేయను అని అని వుండేవాడు ....అదే విభీషణుడు చేసినది ....అందుకే పుణ్యాత్మడు అయినాడు ...

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!