భద్రా చల రామదాసు ఈ కీర్తన

భద్రా చల రామదాసు ఈ కీర్తన 

మన బాల మురళి గారి నోట వినండి .

ఇది నేను చేసిన వీడియో .

(రామజోగి మందు దొరికినవారి జన్మ ధన్యం)

.

రామజోగి మందు కొనరే...

పామరులార రామజోగి మందు కొనరే...

పామరులార రామజోగి మందు కొనరే...

!! రామజోగి!!

రామజోగి మందు మీరూ.. ప్రేమతో బుజియించినపుడే..

కామక్రోధ ములనెల్ల.. పారద్రోలే..

రామజోగి మందు కొనరే...

పామరులార..రామజోగి మందు కొనరే...

!! రామజోగి!!

కాటుక కొండలవంటీ..కర్మములెడబాపే ముందు. సాటిలేదు జగమునందు..

మా స్వామి మందు.. రామజోగి మందు కొనరే..

పామరులార.. రామజోగి మందు కొనరే...

!! రామజోగి!!

కోటి ధనములిత్తుననీ..కొనబోయినా దొరకని మందు.. సాటిలేనీ భాగవతులూ..స్మరణ చేసే..రామజోగి మందు కొనరే...

పామరులార..రామజోగి మందు కొనరే...

!! రామజోగి !!

ముదముతో బద్రాద్రి యందూ.. ముక్తిని పొందించే మందు..సదయుడైన రామదాసు..

సద్భక్తితొ కొలిచే..రామజోగి మందు కొనరే...

పామరులార..రామజోగి మందు కొనరే....

అందరికీ అంత తేలిగ్గా దొరుకుతుందా ఈ రామజోగి మందు?

ఈ రామజోగి మందు రామభక్తులకు మాత్రమే సులభ సాధ్యం !!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!