ముసుగుఁ బెట్టిన నేమి?

కవిసార్వభౌముడు శ్రీనాధుడు .!

సీ:- 

ముసుగుఁ బెట్టిన నేమి? ముత్యాల కమ్మల

క్రొమ్మించు లీలలు కులుక రించె ;

మోము వంచిన నేమి? మొలక నవ్వుల కాంతి

చెక్కుటద్దములపై జీరు లాడె;

జూడకుండిన నేమి? సొబగు రెప్పలమించి

తేట వాల్మెరుగులు దిచ్చరించెఁ;

జాటుఁజేిసిన నేమి? చకవాకులఁ బోలు

పాలిండ్ల మెఱుగులు బయట పడియె;

గీ: 

సిగ్గు నటియించి , మావేడ్క చిన్నబుచ్చి

యేల యిటు పిసాళించెద? దిదేమి సిధ్ధి

కాము సామ్రాజ్య పట్టంబుగట్టి, నన్ను

కౌగిలింపంగ గదవె! యో కరణ కాంత!

.

కవిసార్వభౌముడు శ్రీనాధుని దారిలో నొక కరణ కాంత గనిపించినది చూచినారుగదా వర్ణనము.

సిగ్గు నటిస్తూ నీవు ముసుగినంత మాత్రమున నేమాయె?

నీముత్యాలకమ్మల కాంతి నీకులుకులను తెలుపుటలేదా?

నీవు మోము వంచిన నేమాయె?

నీమొలక నవ్వుల కాంతి నీబుగ్గల నిగ్గులను బ్రదర్శించుట లేదా?

నీవు చూడకున్న నేమాయె?

నీరెప్పలచాటున దాగిన ఆమెఱపులేమాకు చాలును; పయ్యెద గప్పి చక్రవాకములను బోలిన స్తన సంపదనేల దాచెదవు?

కంచుకమును చీల్చుకొనివచ్చు వాని కాతులే మాకుచాలును. మమ్మేలృయిట్లు విసిగింతువు ?

కాము సామ్రాజ్యమునకు పట్టము గట్టి మమ్మేలుకొనరాదా?

ఓకరణ కాంతామణీ! యని మంచెన వేడికోలు. కరుణించెనోలేదో? అంతాసరహస్యమే!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!