బూచివాని బిలువనంపనా! (బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి.)

బూచివాని బిలువనంపనా!

(బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి.)

.

బూచివాని బిలువనంపనా

గోపాలబాల!

బూచివాని బిలువనంపనా?

బూచివాని బిలువ నంపబోతె వద్దు వద్దనేవు?

బాచి యిచ్చి, జోలపాడి, యూచినాను నిదురబోవు,

బూచివాని బిలువనంపనా?

అల్ల మూరగాయ పెరుగు అన్న మారగించు మంటె

వల్ల తేనె జొనలు గావలెను తెమ్ము తెమ్మనేవు?

బంతి చేతికిచ్చి గోపాల యాడుకొమ్మనంటే

పంతగించి వేఱుచోట బంతులవిగొ తెమ్మనేవు?

బాగుగాను పూలపాన్పు పైన బవ్వళించు మంటే

నాగుబాము పడగనెక్కి నాట్యమాడవలె ననేవు?

మత్తగజము తెచ్చి చిన్న తిత్తిలోపల నుంచి నా

నెత్తిమీద బెట్టి నన్నెత్తికో యశోదనేవు?

రామశైలభద్రగిరి రామదాసు నేలుస్వామి

కామిరార్థఫలము లొసగి కైవల్యము జూపువాడ!

బూచివాని బిలువనంపనా?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!