అల‌నాటి ఆట‌లు ఇక జ్ఞాప‌కాలేనా?

అల‌నాటి ఆట‌లు ఇక జ్ఞాప‌కాలేనా?

ఆటలంటే... ఆనందం, ఆహ్లాదం. కొంత శారీరక వ్యాయామం, మరికొంత మానసిక సంతోషం. వెరసి అందరితో కలిసి పంచుకునే వినోదం. 

కాని నేటి పిల్లలకి ఆటలంటే... ఫేస్‌బుక్‌లో గేమ్స్‌, క్యాండీక్రష్‌, సబ్‌వేసర్ఫ్‌, టెంపుల్‌రన్‌, వీడియోగేమ్స్‌... ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఒళ్లు కదలకుండా, అలసిపోకుండా, నీడపట్టున ఇంట్లో (ఇంకా చెప్పాలంటే ఏసీలో) కూర్చుని పక్కన ఏ స్నాక్సో పెట్టుకుని తింటూ ఆడుకునే ఆటలు.

మరి అలనాటి గోలీలాట, జిల్లంగోడు (కర్ర బిళ్ళ), కుందుళ్లు, ఒంగుళ్ళు దూకుళ్ళు, అచ్చంగిల్లాలు, ఏడు పెంకులాట, పిచ్చి బంతి, బొంగరాల ఆట, కోతి కొమ్మచ్చి, చెమ్మచెక్క, గిన్నగిర, అష్టాచెమ్మ, కబడ్డీ (చెడుగుడు), దాగుడు మూతల దండాకోర్‌, ఒప్పుల కుప్ప. ఇవన్నీ వింటుంటే మీకేమనిపిస్తుంది? 

మళ్ళీ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతున్నారు కదూ! 

బొంగరాలాట : 

కింద మేకు పైనుండి బొంగరం చివరి వరకు తాడు చుట్టి విసిరినప్పుడు ఎవరిది ఎక్కువసేపు తిరిగితే వాళ్ళు గెలిచినట్టు. బొంగరానికి తాడు చుట్టేటప్పుడు, తాడు చుట్టిన బొంగరాన్ని నేలమీద వదిలేటప్పుడు నేర్పు ఉండాలి. లేకపోతే బొంగరం తిరగదు. 

ఈ బొంగరాలు దొరకని వాళ్ళకు ఇంకో ఆట కూడా ఉందండోరు. కుండ పెంకు తీసుకుని, దాని అంచుని గుండ్రంగా అరగదీసి, మధ్యలో పుల్లపట్టేలా రంధ్రం చేయాలి. అందులో కాస్త పొడవుగా ఉండే గట్టి పుల్ల పెట్టి, దానికి అడుగున తుమ్మ ముల్లు గుచ్చి.. ఆ పుల్లని రెండు అరచేతుల మధ్య తిప్పి కిందికి వదిలితే.... బొంగరం ఆటకేమీ తీసిపోదు.

వంగుళ్ళు దూకుళ్ళు : ఒక కాలిని తర్వాత దానిమీద రెండో కాలిని, ఆ తర్వాత దాని మీద చెయ్యి జానలా తెరిచి పెట్టాలి. దానిమీద మరో జాన పెట్టి దాటటంతో మొదలయ్యే ఆట వంగున్న మనిషిని దూకుతూ కిందపడి, మోకాలి చిప్పలు, మోచేతులు పగులగొట్టుకునేవరకు ఆగదు. ఇంట్లోవాళ్ళు తిడతారని ఆ దెబ్బల్ని దాయడానికి మరో అవస్థ.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!