శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(0601) (శ్రీ శేషప్ప కవి)

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(0601)

(శ్రీ శేషప్ప కవి)

.

సీ|| తల్లి గర్భమునుండి ధనముఁదేఁడెవ్వఁడు,

వెళ్ళిపోయెడినాఁడు వెంటరాదు,

లక్షాధికారైన లవణ మన్న మెకాని,

మెఱుఁగు బంగారంబు మ్రింగఁబోఁడు,

విత్తమార్జనఁజేసి విఱ్ఱవీఁగుటె కాని,

కూడఁబెట్టిన సొమ్ము గుడువబోఁడు,

పొందుగా మఱుఁగైన భూమిలోపలఁబెట్టి

దానధర్మము లేక దాఁచి దాఁచి,

,

తే|| తుదకు దొంగల కిత్తురో? దొరల కవునొ?

తేనె జుంటీ గ లియ్యవా తెరువరులకు? 

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!