అహోబిలసార్వభౌమ ||

అహోబిలసార్వభౌమ ||

.

సగము నరునిగ సగము కేసరిగ నుండి

రాజ ఠీవి సటము నలరగ నృసింహ |

పదును కోరల పాపాల పరిహరించు

సర్వసుఖదా యహోబిల సార్వభౌమ ||

.

భావము :

మీ దేహము మనిషిగా, తల సింహముగా ఉంటుంది. 

రాజ ఠీవితో మీ జూలు అద్భుతంగా కదులుతూ ఉంటుంది.

పదునైన మీ కోరలతో మా పాపాలు అన్నింటినీ నాశనం చెయ్యండి. అందరికీ అన్ని సుఖములను ప్రసాదించేది మీరే కదా! 

అహోబిల క్షేత్రానికి సార్వభౌములు మీరే కదా ! 

ఈ పద్యంలో 'నృసింహం' అన్న నామాన్ని స్వామి దయతో వాడడం జరిగింది.

(Padmini Priyadarsini కి కృతజ్ఞలతో)

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.