రామాయణము, సుందరకాండము - మొల్ల ( విశ్లేషణ శ్రీ Satyanarayana Piska గారి విశ్లేషణ.)

రామాయణము, సుందరకాండము - మొల్ల

( విశ్లేషణ శ్రీ Satyanarayana Piska గారి విశ్లేషణ.)

.

దానవు లెప్పుడు చూచిన

మానవులను గెలువగలరు, మది నూహింపన్

మానవభక్షకులై మను

దానవులను గెలువ నరుల తరమే జగతిన్?!

.

చిన్నచిన్న తేలికమాటలతో కవయిత్రి మొల్ల ఎంత అందంగా పద్యమును అల్లినదో చూడండి! మొదటి, చివరి పాదములలో దానవులను, మధ్యన గల రెండు పాదములలో మానవులను తొలిపదముగా వాడి, ఒక వింత సొబగును సమకూర్చినది ఈ పద్యానికి!

.

జగతీశుడు మానవుడట!

నగరే భుజశక్తిచేత నా కెదు రన్నన్?

నగధరుడో, నగధన్వుడొ,

నగభేదియొ, కొంతకొంత నాతోఁ బోరన్?

.

ఇది మరింత అందమైన పద్యము. 

చివరి 2 పాదములు చాలా చక్కగా కూర్చినది మొల్ల! 

నగధరుడు అనగా విష్ణువు (క్షీరసాగరమధన సమయములో కూర్మరూపం ధరించి, మంధరగిరిని తన వీపుపై మోశాడు కదా!). 

నగధన్వుడు అంటే శివుడు. (త్రిపురాసుర సంహార సమయములో మేరుపర్వతమును తన ధనుస్సుగా మార్చుకున్నాడు). 

ఇక, నగభేది అంటే ఇంద్రుడు. (ప్రాచీనకాలములో పర్వతములకు ఱెక్కలు ఉండేవి. వాటిని తన వజ్రాయుధముతో భేదించాడు ఇంద్రుడు).... "

ఈ మువ్వురూ నన్ను కొంతవరకు ఎదిరించగలరేమోకాని, 

మానవుడైన రాముడు నాముందు నిలువలేడు" అని రావణుని భావం, అహంభావం

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!