త్రివర్గ విజ్ఞానం!

                                          త్రివర్గ విజ్ఞానం!
త్రివర్గ విజ్ఞానం!


"ధర్మే చ, అర్థే చ, కామే చ, మోక్షే చ భరతవర్షభ
                      యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్"

భరత కుల శ్రేషా్ఠ! ధర్మార్థ కామమోక్షములను చతుర్విధ పురుషార్థ విషయమున ఇందేమి గలదో అదియే ఇతరత్ర గలదు. ఇందు లేనిది మరి యెచ్చోటను లేదు.
భారతజాతీయ ప్రజాజీవిత సర్వస్వమే మహాభారతమునందలి ఇతివృత్తము. ఇందలి ప్రతి పాత్రయు సజీవమై జీవన మార్గ రహస్యములను దెల్పి మానవుల నడవడిని తీర్చిదిద్దుటలో ప్రముఖపాత్ర వహించును. దాని పరిణామమును, తుదకు ధర్మమే జయించుటను కండ్లకు కట్టినట్లుగా చూపును.
ఆంధ్రమహాభారతం త్రివర్గ (ధర్మం, అర్థం, కామం) సాధనలోని అంతర్యాన్ని ఈవిధంగా ప్రపంచ మానవాళికి వివరిస్తున్నది.
ధర్మం, కామం తగ్గిపోయేటట్లు అర్థపురుషార్థాన్ని (ధనార్జనయే) ధ్యేయంగా సేవించేవాడు కుత్సితుడు. అతడు తప్పక పతనం చెందుతాడు. 

కేవలం ధనం కోసమే అర్థసేవ చేసేవాడు భయంకరమైన అడవిలో గోవులను రక్షించబూనే మందబుద్ధిని పోలుతాడు. ఇక అర్థధర్మాలు రెండింటిని విడిచి కేవలం, కామపురుషార్థపరాయణుడైనవాడు నీరు తక్కువ అయిన చెరువులో ఉండే చేప వంటివాడు.
అల్పజలాలు చేపను ఎట్లా చెరుస్తాయో కామం అట్లే అతడికి హానిని కలిగిస్తుంది. మరి అర్థధర్మాల అనుబంధం సముద్ర మేఘాల సంబంధం వంటిది. సముద్రజలాలు ఆవిరై మేఘాలకు పరిపుష్టి చేకూరుస్తాయి. మేఘాలు వర్షించి సముద్రానికి పుష్టిని కలిగిస్తాయి. అవి పరస్పరపోషకాలు. ఈ విధంగా త్రివర్గ విజ్ఞానం సాధించినవాడు సర్వశ్రేష్ఠుడు.

Comments

  1. చాలా సులభంగా అర్థం అయ్యేలా చెప్పారు. మహాభారతంలో ఈ అర్థ, కామాలకి ఉదాహరణగా ఎవరిని చూడచ్చు, ఇది కూడా దయచేసి వివరించండి.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!