శ్రీ Cheruku Ramamohanrao గారి అమూల్య అభిప్రయం !

శ్రీ Cheruku Ramamohanrao గారి అమూల్య అభిప్రయం !

.

Pre KG,L KG, U KG లకు బదులు ఇంట్లోనే తెలుగు సంస్కృతము అందునా ముఖ్యంగా అమరము నేర్పించితే ఆ తరువాత ఆంగ్లమైనా నల్లేరు పై నడకే.

మా కాలములో అమరము చదవని వానికి నేనమరను

అని సరస్వతీ దేవి చెప్పిందని చెప్పి పెద్దలు నేర్పించేవారు.

అంత ఓర్పు నేటి తలిదండ్రులకున్నదా !

అసలు పెద్ద చదువులలో కూడా Scientific Terms ఆంగ్లము నుండి యధాతథముగా తీసుకొని తెలుగులో Science, maths నేర్చుకోకూడదా! 

.'కృషితో నాస్తి దుర్భిక్షం 

జపతోనాస్తి పాతకం 

మౌనేన కలహం నాస్తి 

నాస్తి జాగరతో భయం' అన్నది నీతి శాస్త్రము. 

ఇక విజ్ఞానమన్నది ప్రవాహము.పొలానికి వాడుకొంటే 

ఫలితం ఎక్కువగా వుంటుంది. ఉన్నదే సర్వస్వమనుకొంటే 

అది అట్లే ఉండిపోతుంది. 

ఒక చిన్న చాటుపద్యాన్ని ఇక్కడ ఉటంకించుతాను :

ఏనాటి అగ్రహారమొ

మానాటికి మాన్యమాయె మా పని దీరన్

మీనాటి కండ్రిగాయెను

నానాటికి తీసికట్టు నాగంభొట్టూ

ఇది నేటి మన పరిస్థితి. యువత ఒక సముద్రము. అందు లేనిదుండదు. ఆలస్యమంతా వెలికి తీయడములోనే !

నా అభిప్రాయము తెలుపుటలో నేనేదైనా పొరబాటు చేసియుంటే మీ సంస్కారము తప్పుగా భావింప జేయనీయదని తలుస్తాను.

తత్సత్

Sree Cheruku Ramamohanrao..గారికి క్రుతగ్నలతతొ

Comments

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!