శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1901) (శ్రీ శేషప్ప కవి)

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(



శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1901)

(శ్రీ శేషప్ప కవి)

.

సీ||

భుజబలంబునఁ బెద్దపులులఁ జంపగవచ్చు,

పాముకంఠముఁ జేతఁ బట్టవచ్చు,

బ్రహ్మరాక్షస కోట్ల బాఱఁద్రోలఁగ వచ్చు,

మనుజుల రోగముల్ మాన్పవచ్చు,

జిహ్వ కిష్టముగాని చేదు మ్రింగఁగ వచ్చు,

బదను ఖడ్గము చేత నదుమవచ్చుఁ,

గష్టమొందుచు ముండ్ల కంపలోఁ జొరవచ్చుఁ,

దిట్టుపోతుల నోళ్ళు కట్టవచ్చుఁ,

తే|| 

బుడమిలో దుష్టులకు జ్ఞానబోధఁ దెలిపి

సజ్జనుల జేయలేఁడెంత చతురుఁడైన,

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!