మా వూరు విశాఖపట్నం జిల్లా చోడవరం. !

చోడవరం. !

.

మా వూరు విశాఖపట్నం జిల్లా చోడవరం. 

(నా భార్య చెబితే నేను రాసేను )

అక్కడ మట్టిలోనే ఎదో శక్తి ఉంది. మా ఊళ్ళో ఎవర్ని కదిలించినా కవిత్వం చెప్పగలరు. మాట్లాడితే కావ్యం, పాట పాడితే గేయం, వెటకారానికి, వ్యంగ్యానికీ, మానవతకీ 

మా ఊరు పుట్టింది పేరు.

టైం ఎంతయిందిరా... అని ఎవరన్నా అడిగితే,

“ఇందాకటి కంటే ఎక్కువే “ అని చెప్పే తిమ్మారింపు మా వాళ్ళకే చెల్లుతుంది.

ఒంట్లో బాగులేని మనిషిని పరామర్శించి “ చచ్చీ దాకా బతుకుతావులేహే ”

అంటూ గడుసుగా ధైర్యం చెప్పి, వాడికేదో సాయం చేసే మానవత మా ప్రజానీకం

సొంతం. అలాంటి వాతావరణం లో నా బాల్యం గడిచింది. 

నా నడత లో అదంతా రంగరించుకు పోయింది. 

ఈవారపు “ నవ్య “ లో ప్రత్యేకం 

డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారు : భలే నచ్చేసింది 

ఆయన సొంత ఊరు చోడవరం పరిచయం. అసలు మా వూరు( విజయవాడ ) నుంచీ బయలుదేరి ఏలూరు దాటుతున్నప్పుడే మొదలవుతుంది 

ఈ వెటకారపలంకారం. అలా తెలుగు రాష్ట్ర అంచు దాకా వెళ్ళే సరికి ఇంకెంతవుతుందో ఆ చమత్కారం.

ఉత్తరాంధ్ర తెలుగు సౌరభాన్ని తన వంతుగా కలం చేసి అందించిన ఆయన గురించిన పరిచయం లో సామాన్యుడే నాకు మాన్యుడని. సామాన్యుని మాటలు యధాతధంగా వ్రాస్తే మంచి రచయిత అయిపోవచ్చు అని చెప్పటం అయన అణుకువ మనస్తత్వానికి చిత్ర పటం.

వారి మాటల్లోనే సామాన్యుని అసామాన్య భాషా పటిమ : మా వూళ్ళో రిక్షా తొక్కే కూలన్నయ్య కూడా అద్భుతం గా మాట్లాడగలడు. ఎవరైనా గీచి గీచి బేరాలాడుతుంటే

“ మీరు సేప్పీ సోటు కల్లకి దగ్గరిగానే ఉంటాది గానీ బాబూ ... కాల్లకి మాత్రం దూరంగుంతాది బాబూ “ అని జీవితానుభవం తో మాట్లాడగలడు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!