శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1201) (శ్రీ శేషప్ప కవి)

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ


.

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(1201)

(శ్రీ శేషప్ప కవి)

.

సీ||

పాంచభౌతికము దుర్భరమైన కాయం బి

దెప్పడో విడుచుట యెఱుకలేదు,

శతవర్షములదాఁక మితముఁ జెప్పిరి కాని,

నమ్మరాదామాట నెమ్మనమున

బాల్యమందో; మంచి ప్రాయమందో, లేక

ముదిమియందో, లేక ముసలియందొ,

యూరనో, యడవినో, యుదకమధ్యముననో,

యెప్పుడో యేవేళ నే క్షణంబొ?

తే||

మరణమే, నిశ్చయము, బుద్ధిమంతుఁడైన

దేహ మున్నంతలో మిమ్ముఁ దెలియవలయు, 

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!