నీతి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి

నీతి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి!

.

మగధ దేశమునఁ దరిదుర్గమను పట్టణము కలదు. అందు మహావిభవ సంపన్నుఁడయి శుభదత్తుఁడను వైశ్యుఁడు కలఁడు. అతఁడు సంతానము లేనివాఁడు కాఁబట్టి తన ధనమారామ తటాకాది ప్రతిష్ఠలకు వెచ్చించుచు నా పట్టణములో నొక దేవళము జీర్ణమై యుండగాఁ జూచి కారువులను రావించి తగిన వేతనములు నియమించి దాని గట్ట నియోగించెను.

వారు దాని గట్టు చుండగా నొకనాఁడు చేవదూలము ఱంపముచేఁ గోయించుచు నది 

సుకరముగా వ్రీల్చుటకు సూత్రధారుఁ డక్కడక్కడ మ్రాని మేకులు దిగగొట్టి 

మధ్యాహ్న భోజనార్థము కూలివాండ్రును దానును బోయెను.

అప్పుడా పరిసర తరువులందుఁ దిరుగుచున్న కోఁతులు దేవాలయము 

దాపునకు వచ్చి ప్రాకారములు ప్రాఁకుచు బ్రాంత మహీరుహముల మీఁదికి 

గుప్పించి దాఁటుచు బెనుఁగొమ్మలు కరములతోఁ బట్టి యూఁచుచు విమానముల మీఁదఁ గూర్చుండి వికృతముగా బరులు వీఁపు గీరుకొనుచు నిక్కుచు బొమలెత్తి యురుగొట్టి బెదరించుచుఁ బండ్లికిలించుచు వెక్కిరించుచు నొకటి నొకటి కురుపు మీఁద బండించుకొని మేనిపేల నేరి నోరవేసికొనుచుఁ గిలకిలారావములు గావించుచు నొండొంటితోఁ బోరుచు ఫలములు భక్షించుచు మధువు లానుచు స్వాభావిక చపల భావముతోఁ దిరుగుచుండెను.

.ఒక ముసలి మల్లు కాల చోదితమై చేవ దూలము డాసి యెక్కి దాని నెరియలోఁ దన ముష్కము వ్రేలం గూర్చుండి, యందు బిగియ గొట్టిన కొయ్యమేకును రెండు చేతులతోఁ జిక్కబట్టి బలిమితో నూడ బెరికి యా నెరియలో వ్రేలుముష్కము చదియుటఁజేసి ఱోలుచుఁ గాల ధర్మము నొందెను.

.

కాఁబట్టి జోలిమాలిన పనికిఁ బోరాదు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!