శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(0701) (శ్రీ శేషప్ప కవి)

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!

శ్రీధర్మపుర నివాస.దుష్ట సంహార.నరసింహ!(0701)

(శ్రీ శేషప్ప కవి)

.

సీ|| లోకమం దెవఁడైన లోభిమానవుఁడున్న

భిక్షమర్ధికిఁ జేతఁ బెట్టలేఁడు,

తాను బెట్టకయున్నఁ దగవు పుట్టదుకాని

యొరులు పెట్టఁగజూచి యోర్వలేఁడు,

దాతదగ్గఱఁ జేరి తన ముల్లె పోయినట్లు

జిహ్వతోఁ జాడీలు చెప్పు చుండు

ఫలము విఘ్నంబైనఁబలు సంతసము నందు,

మేలుకలిగినఁ జాల మిణుఁకుచుండు,

.

తే|| శ్రీరమానాధ ! యిటువంటి క్రూరునకును

భిక్షుకుల శత్రువని పేరు బెట్టవచ్చు, 

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!