గురు శిష్య బంధం! (శ్రీ చెళ్ళ పిళ్ళ వెంకట శాస్త్రి, ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం)

గురు శిష్య బంధం!

(శ్రీ చెళ్ళ పిళ్ళ వెంకట శాస్త్రి, ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం)

.

చెళ్ళ పిళ్ళ వెంకట శాస్త్రి గారి ప్రధాన శిష్యుడు పింగాలి తన వెంటే ఎప్పుడూ తీసుకొని వెళ్ళే వాత్సల్యం వారిది 

.శాస్త్రి గారిఉ మరణిస్తే అప్పటి దాకా ఆయన నిర్వహించిన ఆస్థాన కవి పదవి ఖాళీ అయితే ఎవరిని నియమించాలన్న విషయం లో మంత్రి గోపాల రెడ్డి వీరి దగ్గరకు వచ్చి సలహా అడిగారు .

అప్పుడు పింగళి ‘’మీ ఆస్థాన కవి పదవి మా గురువు గారికి ఒక ‘’ఫుట్ స్టూల్ ‘’లాంటిది .నేనుద్దేశించిన వాజ్మయపు గద్దె అది కాదు ‘’అని చెప్పి వేరేవారి పేరో సూచించారట 

.ఇంగ్లీష్ -తెలుగు నిఘంటువు ను నిర్మించిన ఘనత పింగళి వారిది .అందులో ప్రయోగం అనువదించే పధ్ధతి చూపి కొత్త మార్గం పట్టించారు .ఆంధ్రా యూని వర్సిటి లో ఉద్యోగ విరమణ త్తర్వాత ఇరవై ఏళ్ళు కవిత్వం జోలికే పోలేదు

1948 లో వెంకట శాస్త్రి గారిని ఆస్థాన కవిగా మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తే విజయ వాడ లో గొప్ప సన్మాన సభ జరిపారు శిష్యులు .అప్పుడు కట్టమంచి రామ లింగా రెడ్డి మాట్లాడుతూ ‘’వెంకట శాస్త్రి గారు చేసిన సాహిత్య వ్యాసంగం అవధానాలు ఒక ఎత్తు అయితే పింగళి లక్ష్మీ కాంతం అనే శిష్యుడిని తయారు చేసి ఆంద్ర విశ్వ విద్యాలయానికి సమర్పించటం ఒక ఎత్తు ‘’అని శ్లాఘించారు గురు శిష్యులిద్దరికి గర్వకారణమైంది

‘’భూలోకం లో నువ్వు ఏమేమి పనులు చేశావో చెప్పు ?అని దేవుడు నన్ను ప్రశ్నస్టే ‘’కవిత్వం రాశా .నాటకాలలో రాజు పాత్రలు ధరించా అని తల ఎత్తుకొని చెబుతా .కొంత కాలం ఉపాధ్యాయుడిగా పని చేశాను అని తల దించుకొని చెబుతా ‘’అన్నారట విశాఖ పట్నం లో విశ్వ విద్యాలయం తన పదవీ విరమణ రోజున అందరూ ప్రశంశలు కురిపిస్తుంటేదీని భావమేమిటో తెలీక అందరూ బుర్రలు దిన్చుకోన్నారట .

శిష్య వాత్సల్యం చూపిస్తూ గురువు పింగళి వారి క్లాసు లో కూర్చుని ఆంధ్రా వర్సిటి లో పాఠంవిన్నారు .బయటికి వచ్చి ‘’నా పేరు నిల బెట్టాడు మా శిషుడు .నేను ఊహించిన దాని కంటే ఎన్నో రెట్లు పెరిగాడు నా ఊహకు అంద నంత ఎదిగాడు ‘’అన్నారు గురువు గారు ..భారత ఉప రాష్ట్ర పతి సర్వేపల్లి రాదా కృష్ణన్ 1957.లో విజయ వాడ వచ్చినప్పుడు పింగళి వారు కనపడక పొతే వారెక్కడ అని నిర్వాహకులను నిలదీశారట .ఆయనకు ఈయనతో ఇంట అను బంధం ఉందని తెలియని నిర్వాహకులు పింగళి వారిని ఆహ్వానిన్చనే లేదట అందుకని పింగళి రాలేదు

క్లాసులో పాఠాలు చెప్పా టానికి వెళ్లి నప్పుడు చెప్పులు క్లాస్ బయటే వదిలేసి ఒక దేవాలయం లో ప్రవేశిస్తున్న భావం తో లోపలి వెళ్లి చెప్పేవారు .చేతిలో పుస్తాకం కానీ చిన్న కాగితం కాని ఉండేది కాదు. గంట సేపు గంట కొట్టినంత పకడ్బందీ గా ఆరోజు విషయాన్నిసమయం లో పూర్తీ చేసి బయటికి వచ్చే వారు ఇది అందరికి ఆదర్శం కావాల్సిన విషయం పింగళి వారు యూని వర్సిటి లో చూపించిన తయారు చేసిన పాఠ్య ప్రణాళిక అనేక విశ్వ విద్యాలయాల్లో యాభై ఏళ్ళు అవిచ్చిన్నం గా చూపుడు వేలితో శాసించి,కొనసాగింది అది ఆయనకు గొప్ప గర్వ కారణం .ఆయనకే కాదు మనకూ.ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తీ పై మాట్లాడుతూ ‘’చక్రాంకితాలు లేని సహజ వైష్ణవులు లక్ష్మీ కాంతం ‘’అన్నారు ఆచార్య కోగంటి సీతా రామాచార్యులు .ఇంతకంటే కితాబు వేరొకటి ఉంటుందా ? .Johnstone ‘’ఇంగ్లీష్ పాఠాలు ఎలా చెప్పేవాడో అలాగే పింగళి తెలుగు పాఠాలు అంత గొప్పగా ,సొగసుగా చెప్పేవారు .కాటూరి వారిది శ్రీ వత్స గోత్రం ఇది ఎర్రన గోత్రమే .పింగళి వారిది గౌతమ్ గోత్రం తిక్కన సూరన గారిదీ ఇదే గోత్రం

దుగ్గిరాల గోపాల క్రిష్నయ్య బందరు వచ్చి స్వాతంత్ర్యోద్యమం లో పని చేయాలని యువకులను ప్రోత్సహిస్తున్నారు .పింగళి వారు ఆయన వెంటే ఉన్నారు .కాని స్పందించలేదు బందరు నుంచి వెళ్లి పోతు దుగ్గిరాల you have disappointed me ‘’‘’అని బాధ తో వెళ్లారట .పింగళి జనం జనవరి పది మరణం 10-1-1972అంటే జనన మరణాలు ఒకే తేది. దీనిపై శ్రీ మల్లెల గురు మూర్తియా అనే శిష్యుడు –

‘’జనవరి పది జననంబా –జనవరి పది నాదే –దైవ సాయుజ్యంబా /ఘనమగు ణీ సా ధర్మ్యము –జననము –మృతి యొక్క తన్న సత్యము చాతెన్ ‘’అని గొప్ప తత్వికామ్శాన్ని జోడించారు .పింగళి వారి పదవీ విరమణ కూడా 1949జనవరి పది ఏ అవటం విచిత్రం

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!