ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారిసాహిత్యవిశేషాలు!

ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారిసాహిత్యవిశేషాలు!

1960లో ఆగ్రా లో అఖిల భారత బెంగాలీ సభలు జరిగితే ప్రత్యెక అతిధిగా వెళ్లి మహా భారతం విశిష్టత మీద గంట సేపు అనర్గళం గా ఆంగ్లం లో ప్రసంగించి అందరిని ఆశ్చర్య చకితుల్ని చేశారు .అక్కడి వాళ్ళు ‘’మీ ఆంద్ర దేశం లో చైతన్య ప్రభువు ప్రభావం లేదటగా కృష్ణ భక్తీ మీకు తెలియదట గా ?’’అని అడిగితే లక్ష్మీ కాంతం గారు ‘’మీ చైతన్యుడి కంటే ముందే మా మధుర కవి పోతన్న భాగ వతాన్ని రాశాడు. కృష్ణ భక్తిని ఇంటింటా పాదుకోల్పాడు ఆయన పద్యాలు రాని తెలుగు లోగిలి లేదు ‘’అని చక్కని సమాధానం చెప్పి వాళ్ళ కళ్ళు తెరిపించారు .

ఆంద్ర ప్రభ వార పత్రికలో శ్రీ తిరుమల రామ చంద్ర ‘’మరపు రాని మనీషులు ‘’శీర్షిక తో తెలుగు ప్రముఖులను గురించి రాస్తున్నారు .ఆయన ఈయన ఇంటర్వ్యు కోసం వస్తే ‘’నాకు మీ ప్రచారం అక్కర్లేదు నా పనేదో నేను చేసుకు పోతున్నా ‘’అని నిష్కర్షగా చెప్పారు .ఆయన వీరిపై వ్యాసం రాసి అందులో ‘’పింగళి వారికి ప్రచార సాధనం వారి శిష్యులే .నూటికి నూరు పైసలా ఆయన ఆచార్యులు .నిజమైన ఉపాధ్యాయులు ‘’అని ముక్తాయింపు ఇచ్చాడు .

కేంద్ర సాహిత్య ఎకాడమి కి ఎక్సి క్యూటివ్ కౌన్సిల్ సభ్యులైనారు దాని అధ్యక్షుడు నెహ్రు .ఒక మంచి పుస్తకానికి పురస్కారం ఇవ్వాలని కౌన్సిల్ మీటింగ్ లో పింగళి వారు సూచిస్తే నెహ్రు అది అనువాద పుస్తకం కదా అంటే అనువాదం చేసిన తీరు వర్ణించి నెహ్రూను ఒప్పించి పురస్కారాన్ని అందించారు .అప్పటి నుండే తెలుగులో అనువాదమైన వాటికి పురస్కారాలివ్వటం ప్రారంభ మైంది ఇది పింగళి వారి చలవే .

ఇరవై అయిదేళ్ళు యూని వర్సిటి స్థాయిలో ‘’ఆంద్ర సాహిత్య చరిత్ర ‘’బోధించిన అనుభవం పింగళి వారిది ఆయన రాసిన ‘’సాహిత్య శిల్ప సమీక్ష ‘’వంటి పుస్తకం న భూతో గా నిలిచి ఆయన ప్రతిభకు గీటు రాయి అయింది దీనికి ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి అవార్డు వచ్చింది .కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు రాకుండా ఒక మంత్రి అడ్డు పడ్డారని వారి కుమారుడు సుందరం గారు రాశారు సాహిత్య శిల్ప సమీక్ష లో పరమ ప్రామాణిక మైన పారిభాషిక పదాల సృష్టి చేశారు లక్ష్మీ కాంతం గారు ‘’aesthetic art ‘’కు లలిత కళలు అనే చక్కని మాటను వాడారు ‘’.climax’’పదానికి శిఖరారోహణం అన్నారు

కాటూరి వెంకటేశ్వరరావు గారితో కలిసి జంట కవిత్వం చెప్పారు .తొలకరి సౌందర నందం రాశారు .కాటూరి వారు మరణిస్తే ‘’నాకు మిత్రుల కంటే శత్రువుఎ ఎక్కువ .ఉన్న ఒక్క మిత్రుడూ వెళ్లి పోయాడు ‘’అని బాధ పడ్డారు .గురువు వెంకట శాస్త్రి గారిని కాటూరి వారిని స్తుతిస్తూ పింగళి వార్ చెప్పిన పద్యం చిరస్మరణీయం .

‘’ప్రేణిత సద్రసజ్నుడు పింగళి కాంతుని కావ్య శిల్ప ని –ర్మాణ దురీణ బుద్ధి గరిమంబున కిర్వురే సాక్షులిమ్మహిన్

వాణికి వాణి యైన గురు వర్యుడు చెల్పిల వేంకటేశుడున్ ,-ప్రాణము ప్రాణమైన గుణరమ్యుడు కాటురి వేంకటేశుడున్ ‘’ తెలుగు ఎకాడేమిలో పుస్తకాలు ఎలా ఉండాలి అన్న దాని పై జరిగిన వాదోప వాదాలలో పింగళి వారు ఒక రాజీ ఫార్ములా చెప్పి అందరిని సంతృప్తి పరచారు ‘’మాత్రు భాషా గ్రంధాలలో సరళ గ్రాంధికం ద్వితీయ భాషా గ్రంధాలలోశిష్ట వ్యావాహారికం ఉండాలి ‘’అన్నది వారి గొప్ప సూచన. సంక్స్క్రుత వ్యాకరణాన్ని పింగళి వారు ‘’ఒక కావ్యం చెప్పినట్లు చెప్పి మనో రంజనం కల్గిస్తారు ‘’‘’అని ముఖ్య శిష్యుడైన ప్రసాద రాయ కులపతి కీర్తించారు .ఆయన చెప్పే ప్రతి వాక్యం ‘’ఒక కావ్య శిల్పమే’’నన్నారు కులపతి ..ప్రసిద్ధ స్సహితీ వేత్త శ్రీ తంగిరాల సుబ్బారావు గారు వీరికి శిష్యులే పి హెచ్ డి పరీక్షలో ‘’నన్నే చోడుడు ‘’పై తంగిరాల రాసిన వ్యాసం ఏంతో నచ్చి ‘’దీన్ని నా‘’దగ్గర ఉంచుకొంటాను ‘’అన్న సంస్కార మూర్తి పింగళి . పద్దెనిమిదేళ్ళు ఆంద్ర విశ్వవిద్యాలయం లో లెక్చరర్ గా రీడర్ గా పని చేసినా ప్రొఫెసర్ గా ప్రమోషన్ ఇవ్వనే లేదు .ఆ లోటు శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం .తీర్చి ఆచార్య పదవినిచ్చి గౌరవించింది .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!