ఆచార్య పింగళి లక్ష్మీ కాంతము గారు ! (అప్పటి చదువులు)

ఆచార్య పింగళి లక్ష్మీ కాంతము గారు !

(అప్పటి చదువులు)

లక్ష్మీకాంతం గారి తండ్రి పింగళి వెంకట నరసయ్య గారు

ఆచార్య పింగళి లక్ష్మీ కాంతముకృష్ణా జిల్లా చల్లపల్లి ఎస్టేట్ లో చిన్న ఉద్యోగి గా ఉండేవారు

చిట్టూర్పు లో కాపురం కొద్దిగా పొలం వ్యవసాయం ఉండేవి 

ఊరిలో మంచి పలుకుబడి గల వ్యక్తీ .

బందరు దగ్గర అర్తమూరు లో మోచర్ల మృత్యుంజయుడు గారి చెల్లెలును వివాహమాడారు .లక్ష్మీ కాంతం గారు ఈ తాలిదంద్రులకుమాతామహుల ఇంట్లో 10-1-1994లో అర్తమూరు లో జన్మించారు .చిట్టూర్పు లో పెరిగారు .

తండ్రిగారు అక్షరాభ్యాసం చేశారు .వీఎది బడిలో చదువుకొన్నారు .తాటాకుల పుస్తకం కుట్టి ,దాని మీద గంటం తో సమతీ శతకం లోని ఒక పద్యాన్ని గురువు గారు రాసి ఇచ్చి మూడు సార్లు అని పించి మర్నాడు ఒప్ప జెప్పుకోనేవారు .

ఈయనకు ఆనేదికాడు రోజుకు పది పద్యాలైనా కావాలన్నంత ఆకలి .కాని గరువు మరీ బతిమిలాడితే రెండు పద్యాలు రాసేవారంతే .

రెండు నెలలో సుమతీ శతకం పూర్తీ చేశారు .

ఒక్క ఏడాదిలో ఎనిమిది శతకాలు బట్టీ పట్టేశారు .ఆ రోజుల్లో పద్యానికి అర్ధం చెప్పేవారు కాదు .పిల్లలు అడిగే వారూ కాదు .

అప్పుడు చదువు అంటే భాష రావతామే స్వచ్చంగా ,స్ఫుటం గా ఉచ్చరించటం మాట్లాడినా చదివినా ఎలా పలకాలే బాగా తెలిసేది. ఒరవడి అంటే కాపీ రాయించేవారు దానితో దస్తూరి బాగా కుదిరేది

నోటి లెక్కలు ,వడ్డీ లెక్కలు నేర్పేవారు బాల రామాయణం వల్లే వేయించేవారు .దస్తావేజుల మతలబు ,భూమికోలతలు ,పంచాంగం చూసి మంచి చెప్పతంలగ్నాలు పెట్టటం కూడా వీధి బడిలో నేర్పేవారు భజనలు కూచి పూడి నాటకాలు ఊరిలో జరుగుతూ ఉంటె వెళ్లి శ్రద్ధగా వినే వారు చూసే వారు నాటకం పూర్తీ అయ్యేసరికి తెల్లారేది .అందులోని పాటలన్నీ నోటికి వచ్చేసేవి .

ఒక వేల పాత మర్చి పోతే స్వంత మాటలతో పూరించి పాడుకొంటూ ,తోటి వారితో పాడించేవారు లక్ష్మీ కాంతం తిరునాళ్ళ లో పుస్తకాలు కొని చదివే వారు .పదమూడవ ఏటికే వందలాది పద్యాలు నోటికి వచ్చేశాయి కనీసం వంద పాటలూ వచ్చాయి ఈ విషయాలన్నీ లక్ష్మీ కాంతం గారే తమ రేడియో ప్రసంగం లో తెలియ జేశారు .అయిదవ తరగతి వరకు చిట్టూర్పు లోనే చదువుకొన్నారు

పై చదువు

ఆరు ఏడు క్లాసులు గుంటూరు జిల్లా రేపల్లె లో చదివారు. 

బందరుకి చేరి ఐదో ఫారం లో చేరారు అప్పుడే తండ్రి గారి మరణం సంభవించింది గురువు గారు చెళ్ళ పిళ్ళ వెంకట శాస్త్రి గారు ఈ కుర్రాడిని చిట్టూర్పు వెళ్ళమని చెప్పి రావటానికి కొంత కాలం పడుతుంది కనుక ‘’తెలుగు మహా భారతం’’ బాగా చదువుకొని రమ్మని పంపారు 

తండ్రి నరసయ్య గారు పెత్తందారు .ఊళ్ళో వాళ్ళు ఆయన దగ్గరే డబ్బులు దాచుకొనేవారు వాటిని వడ్డీకి తిప్పి వాళ్లకు అంద జేసే వారు .తండ్రి మరణం తో డబ్బులు ఇచ్చిన వారు డబ్బుకోసం వత్తిడి తెచ్చారు . ఉన్న ఆస్తి అంతా అమ్మేసి బాకీలు తీర్చింది తల్లి .ఆవిడకు కాని మిగిలిన వారికి కాని డబ్బు విషయాలేమీ తెలీదు 

సంతానానానికి ఏమీ మిగలలేదు అప్పుడే ఆ ఊరి మునసబు గారి అమ్మాయి తనకు మహా భారతం పురాణం గా చెప్పేవారేవరున్నారని వాకబు చేసింది లక్ష్మీ కాంతం గారే చెప్పగలరని అందరు చెప్పగా వచ్చి అడిగితే వారింటికి వెళ్లి భారతాన్ని చక్కగా విడమర్చి రెండు నెలల్లో పూర్తీ చేసి ఆవిడతో బాటు విన్న వార్సందరికి సంతృప్తి కలిగించారు 

.ఇలా గురువు గారి మాట నిల బెట్టారు .అదే భారత ప్రవచనానికి నాంది అయింది .భారతాన్ని క్షున్నం గా పరిశీలించే ప్రయత్నానికి ఇక్కడే అంకురార్పణ జరిగింది .లక్ష్మీ కాంతం గారింనగారు నరసయ్య ,తమ్ముడు వీరయ్య ,సోదరి సుందరమ్మ .ఇక చిట్టూర్పు లో ఉండలేక తల్లి పిల్లలతో పుట్టిల్లు అర్తమూరు చేరింది తండ్రి మరణం ,వ్యవహారాలూ తో ఒక ఏడాది చదువు ఆగిపోయింది మళ్ళీ బందరు చేరి తినటానికి ఏమీ లేక వేరుసెనగ పప్పులు తిని మున్సిపల్ కుళాయి నీరు తాగి గడిపేవారు కాంతం గారు .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!